Game Changer Movie” ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మనసుకు హత్తకుంటాయి. అటువంటి సినిమాలు చూశాక సమాజం కోసం ఏదో చేయాలని కాసేపైనా ఆలోచనలో పడుతాం.. ఇటీవల వచ్చిన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోణంలోనే ఎక్కువ ఉన్నాయి. కానీ గేమ్ చేంజర్ (Game Changer) సినిమా అలా కాదు.. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న తీరుతెన్నుల గురించి అద్భుతంగా వివరించారు. ఒక గవర్నమెంట్ అధికారి ఏం చేయాలో చూపెట్టాడు. జిల్లా కలెక్టర్ ఉండే అధికారాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో ఇందులో చూడొచ్చు. ఓ రాజకీయ పార్టీ పెట్టి డబ్బులేని రాజకీయం చేద్దామని చెప్పిన స్నేహితుడే తీరా డబ్బు ప్రలోభాలకు లొంగిపోవడం. నిజాయితీ పరుడైన స్నేహితుడిని చంపడం ఇందులో చూడొచ్చు. ఓ పెద్ద ఐరన్ ఇండస్ట్రీ కంపెనీ డబ్బులు ఇవ్వడం. హీరో స్ధాపించిన పార్టీ అధికారంలోకి రావడ చకచకా జరిగిపోతాయి. కానీ అధికారంలోకి వచ్చాక అడ్డగోలు అవినీతి, ముఖ్యమంత్రి అతని కొడుకులు చీకటి దందాలతో దోచుకోవడం ఇందులో ఉంటుంది. వీటన్నింటీ జిల్లా కలెక్టర్‌గా హీరో వాటిని ఎదుర్కొవడం ఈ సినిమాలో చూడొచ్చు. అదే జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయి.. ఆ తర్వాత (Election Officer) ఎలక్షన్ ఆఫీసర్ గా రాష్ట్రానికి వచ్చి అవినీతిపరులను ఎన్నికల్లో గెలువకుండా చేయడం వరకు ఈ సినిమా ఆసక్తికరంగా సాగింది. ఎక్కడా పెద్ద పెద్ద పైటింగ్లు, భారీ డైలాగులు లేవు. అశ్లీల డ్యాన్సులు, డబుల్‌మీనింగ్ డైలాగులూ లేవు. ప్రజల్లో మార్పు తీసుకురావాలని పరితపించే హీరో. లవ్ స్టోరీ ఉన్నప్పటికీ అదే సినిమా అన్నట్టుగా సాగలేదు. ప్రేమ అనే కాన్సెప్ట్ ఎంతవరకు ఉండాలో అంత వరకే ఉంది. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా చూడొచ్చు. అభ్యంతరంగా ఉండే సీన్లు లేకపోవడంతో సినిమా చూసినంత సేపు పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉన్నతాధికారులుకావాలనే కాంక్షను కూడా పెంచొచ్చు. రాజకీయ అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టడం (Game Changer) గేమ్ చేంజర్ ప్రధాన బాధ్యతగా సాగింది. జిల్లాల్లో జరిగే చీకటి దందాలను వెలికి తీయడం, బ్లాక్ దందాలను అరికడుతుంటారు మన హీరో. ఈ క్రమంలోనే వాటి వెనుక ఉన్న మినిస్టర్‌తో హీరో కు మధ్య సాగే పోరాటమే ఓవరాల్ (Game Changer) గేమ్ ఛేంజర్.. ఇటువంటి సినిమాల వల్ల సమాజంలో కొంత అవగాహన పెరుగుతుంది. నిజాయితీ గల ఆఫీసర్ తలుసుకుంటే అవినీతి పరులైన రాజకీయనాయకులను గేమ్ లోకి రాకుండా చేయడమే ఈ గేమ్ చేంజర్.
కంటెంట్ రాసింది పోకల మధు.. సీనియర్ జర్నలిస్ట్
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
Hindustan Aeronautics Ltd” హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టెన్త్/ 12వ తరగతి అర్హతతో పోస్టులు