మహబూబాద్ జిల్లా గూడురు మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన అజ్మీరవి, కవిత భార్యభర్తలు. ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అజ్మీరరవి అక్టోబర్ 24న పొలం చూసొద్దామని వెళ్లాడు. కానీ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తన భార్యా కవిత ఏం జరిగిందో తెలుసుకుందామని పొలం దగ్గరకు వెళ్లింది. పొలం వద్ద భర్త విగతజీవిగా పడిఉండటాన్ని చూసి లబోదిబోమంటూ తన భర్తచనిపోయాడని కుటుంబ సభ్యలకు, చుట్టు పక్కలవారికి ఏడ్చుకుంటూ చెప్పింది. తన భర్త కరెంటు షాక్‌తో చనిపోయాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ మృతుడి తల్లి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ ఐ రాణాప్రతాప్ పొలం వద్దకు వెళ్లి చుట్టుపక్కల పరిశీలించాడు. అక్కడున్న వైర్లను చూస్తే కావాలనే ఏర్పాటు చేసినట్టు ఎస్ ఐకి అనుమానం కలిగింది. రవి భార్య కవిత తీరు అనుమానస్పదంగా ఉండడతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. దుబ్బగూడెం గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి కవితకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలిసింది. వీరి మధ్య ఏడేండ్లను నుంచి వివాహేతరం సంబంధం ఉందన్న విషయం భర్త రవికి తెలియడంతో వారిని హెచ్చరించాడు. పెద్దమనుషుల సమక్షంలోనూ పంచాయతీలు జరిగాయి. కానీ వారి తీరులో ఏటువంటి మార్పు రాలేదు. వీరి సంబంధానికి భర్త రవి అడ్డుగా ఉన్నాడని రవిని చంపాలని కవిత శివ పథకం వేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 23న కవిత, శివ ఇద్దరు కలిసి ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కనెక్షన్ తీసి రవి పొలం వద్ద వదలిలేశారు. ఇది గమనించని రవి అక్టోబర్ 24 ఉదయం పొలంవద్దకు వెళ్లి ఆ తీగలపై కాలు వేయడంతో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్టు గూడురు సీఐ ఫణిదర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
నాభర్తను చంపేయి.. సింగరేణి ఉద్యోగం చేసుకుందాం
భార్యను చంపి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి.. ప్రియురాలి భర్తను చంపి.. సినిమాను తలపించే స్టోరీ
బీజేపీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..