తల్లితో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిపైకి డీసీఎం వ్యాన్ దూసుకెళ్లడంతో బాలుడు అక్కడిక్కక్కడే మృతి చెందాడు. ఈఘటనపై ఆర్టీసీ ఏండీ వీసీ సజ్జనార్ స్పందించారు. తల్లితో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు వెళ్తున్న తొమ్మిదేళ్ల బాలుడిని విధి బలి తీసుకోవడం అత్యంత దురదృష్టకరం,బాధాకరమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృత్యురూపంలో దూసుకువచ్చిన ఓ డీసీఎం వాహనం అభంశుభం తెలియని ఆ బాలుడిని పొట్టనపెట్టుకుందని పేర్కొన్నారు. పాదచారులు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా రోడ్డు ప్రమాదాల్లో దుర్మరణం చెందటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
ఘటన జరిగింది ఇలా…
హైదరాబాద్లోని ఓల్డ్ అల్వాల్ కు చెందిన భరత్, లత దంపతులకు ఇద్దరు కుమారులు.. (స్టీఫెన్, తిరుపాల్, ) ఇటీవల భరత్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ( ఫిబ్రవరి 8)న మధ్యాహ్నం లత తన పిల్లలిద్దరిని తీసుకుని హాస్పటల్‌కు నడుచుకుంటు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు అవతలి వైపు నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా వీరిపైకి దూసుకొచ్చింది. తల్లి లత, కుమారు స్టీఫెన్ పక్కకు పరిగెత్తారు. కానీ తిరుపాల్ తప్పించుకునే లోపై అతడిపై డీసీఎం దూసుకెళ్లింది. దీంతో తిరుపాల్ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై విధంగా స్పందిస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు.
తల్లితో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు వెళ్తున్న తొమ్మిదేళ్ల బాలుడిని విధి బలి తీసుకోవడం అత్యంత దురదృష్టకరం, బాధాకరం. మృత్యురూపంలో దూసుకువచ్చిన ఓ డీసీఎం వాహనం అభంశుభం తెలియని ఆ బాలుడిని పొట్టనపెట్టుకుంది. పాదచారులు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా… pic.twitter.com/eufQnLM4f8
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 8, 2024
ఇవి కూడా చదవండి
యువతిని నరికి చంపిన యువకుడు
బస్సులో సీటు కోసం ఫైటింగ్.. వీడియో వైరల్
భవనం కూలి ఆరుగురు కార్మికుల దుర్మరణం