భవనం కూలి ఆరుగురు కార్మికుల దుర్మరణం ఐదుగురు మృతి చెందిన ఘటన తమిళనాడులోని ఊటీ సవిూపంలో లవ్‌డేల్‌లో బుధవారం చోటు చేసుకుంది. బిల్డింగ్ లోని ఒక భాగం కూలిపోవడంతో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు మృతి చెందారు. చనిపోయిన వారిలో సకిల (30), ఉమ (35), ముత్తులక్ష్మీ (36), సంగీత (35), భాగ్య (36), రాధ (38)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారని వారిని చికిత్స కోసం ఊటీ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఒక కార్మికుడు శిథిలాలలో చిక్కుకున్నాడని.. అతన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి
RAKUL” బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చుకున్న రకుల్
It’s a swimket” భూమ్మీద ఆడితే క్రికెట్… ఇది స్విమ్‌కెట్ వీడియో వైరల్