నిర్మల్ జిల్లాలో గురువారం ఘోరం చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ అమ్మాయిపై యువకుడు గొడ్డలితో దాడి చేసి నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణాంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన అలేఖ్య(23) తన స్నేహితురాలు అయిన జియాతో కలిసి సమీపంలోని మార్కెట్ వచ్చింది. మార్కెట్లో వస్తువులు కొని తిరిగి వెళ్తన్న అలేఖ్యపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో అలేఖ్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్నేహితురాలు జియాకు మూడేండ్ల చిన్నారికి గాయాలయ్యాయి.
పట్టపగలే నడిరోడ్డుపై ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపిన ప్రియుడు
నిర్మల్ – ఖానాపూర్ శివాజీనగర్‌లో పెళ్లికి నిరాకరించిందని అలేఖ్య అనే యువతిని పట్టపగలే ప్రియుడు శ్రీకాంత్ గొడ్డలితో నరికి చంపాడు.. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపైనా దాడి చేయడంతో వారికీ గాయాలయ్యాయి. నిందితుడు శ్రీకాంత్… pic.twitter.com/vZphWKFvIH
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2024
ఇవి కూడా చదవండి
బస్సులో సీటు కోసం ఫైటింగ్.. వీడియో వైరల్