Indiramma House Scheme” పేదల ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలోనే నిజం చేసే దిశగా తెలంగాణ సర్కారు మరో ముందడుగు వేసింది. ‘ఇందిరమ్మ (Indiramma House Scheme) ఇళ్ల పథకం’ను సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో సోమవారం ప్రారంభించారు.
ఈ పథకానికి అర్హులయిన వారికి (Indiramma House Scheme) ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమరో గుడ్ న్యూస్ చెప్పారు. (Indiramma House Scheme) ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దళితులు, గిరిజనులకు మరో లక్ష రూపాయలు అదనంగా ఇవ్వనున్నారు. మొత్తంగా ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున అర్హులయిన వారందరికీ (Indiramma House Scheme) ఇండ్లు రాబోతున్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్లుగా ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని విమర్శించారు. ‘రాష్ట్ర ప్రజల బాధ చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇచ్చిన హవిూలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురు చూశారు. ఇచ్చిన మాట ప్రకారం (Indiramma House Scheme) ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం.’ అని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇండ్లకు సైతం త్వరలోనే పట్టాలిస్తామన్నారు. నాలుగు విడుతల్లో సాయం అందిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Fire Accident In Bus ” మంటల్లో చిక్కుకున్న పెండ్లి బస్సు.. 10 దుర్మరణం
Rythu Bandhu” కొండలు,గుట్టలకు రైతుబంధ్ కట్
Lpg Cylinder Prices” వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. విపక్షాలు ఏమన్నాయంటే…?