చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. సోషల్ మీడియా అయిన ఇన్ స్టాగ్రామ్‌లో భార్యకు ఫాలోవర్స్ భారీగా పెరిగిపోతున్నారని తట్టుకోలేని భర్త కన్న బిడ్డల ముందే భార్యను హత్య చేశాడు. ఈ ఘటన యూపి రాజధాని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 37 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి లక్నోలోని పారా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు ట్రావెల్ ఏజెన్సీని నడుపుతుండగా.. భార్య ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టా గ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తన సోషల్ విూడియా ప్లాట్‌ఫామ్ నుంచి భర్తను బ్లాక్ చేసింది. దీంతో అతడికి విపరీతమైన కోపం వచ్చింది. ఇంటి దగ్గర లేనప్పడు తన భార్యను కొందరు ఫాలోవర్స్ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. దీంతో భార్య, భర్తల గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పిల్లలతో కలిసి రాయ బరేలీకి వెళ్లేందుకు వారు ఎస్‌యూవీ వాహనంలో బయలుదేరారు. అయితే రారుబరేలీకి కాకుండా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి తమ వాహనాన్ని మళ్లించారు. మార్గ మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో ఫాలోయింగ్ వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు. ఆవేశానికి లోనైన అతడు పిల్లల ఎదుటే భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఆ సమయంలో పిల్లలు కారులోనే ఉన్నారు. కుమార్తె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Check Also
Study Table స్టడీ ఫోల్డబుల్ టేబుల్ జస్ట్ రూ.499కే
Study Table స్టడీ కోసం రెల్లాన్ ఇండస్ట్రీస్ స్టడీ టేబుల్ స్టడీ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ టేబుల్ పోర్టబుల్ & లైట్ …