న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (JEE Main) 2026 సెషన్-1 ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు.
తెలుగు రాష్ట్రాల ప్రభంజనం
మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం.
-
ఆంధ్రప్రదేశ్: నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్.
-
తెలంగాణ: వివాన్ శరద్ మహిశ్వరి.
ఫలితాల గణాంకాలు
ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్-1కు రికార్డు స్థాయిలో 13,55,293 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 13,04,653 మంది (96.26%) పరీక్షకు హాజరయ్యారు. జనవరి 21 నుండి 28 మధ్య పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండిలా..
అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింది పద్ధతిలో చూసుకోవచ్చు:
-
అధికారిక వెబ్సైట్ http://jeemain.nta.nic.in సందర్శించండి.
-
‘JEE Main 2026 Score Card’ లింక్‌పై క్లిక్ చేయండి.
-
అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
-
స్కోర్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, దానిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
సెషన్-2 ఎప్పుడంటే?
మొదటి విడత స్కోర్‌తో సంతృప్తి చెందని విద్యార్థులు సెషన్-2 రాయవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది (ఫిబ్రవరి 25 వరకు). సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులను నిర్ణయిస్తారు.
