Kantara” కాంతార: చాప్టర్ 1′ టీమ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు

Kantara”  రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రీకరణ ప్రారంభమైనప్పటి నుంచే వరుస అపశకునాలు చిత్ర బృందాన్ని వెంటాడుతున్నాయి. తాజాగా, ప్రముఖ కన్నడ నటుడు టి. ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. ఉడిపిలోని తన నివాసంలో ఆయన హఠాత్తుగా కుప్పకూలి కన్నుమూశారు. గతంలో కూడా ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందినట్లు సమాచారం.

ఇది ఒక్కటే కాదు — గత కొన్ని నెలలుగా చిత్ర బృందానికి చెందిన పలువురు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నదిలో మునిగి మరణించగా, హాస్యనటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఇటీవల కళాభవన్ నిజూ కూడా గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటనలతో టీమ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.

అంతేకాకుండా, గత నవంబర్‌లో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురవడంతో పలువురు గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం శివమొగా జిల్లాలో జలాశయం వద్ద షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై హౌంబాలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ స్పందిస్తూ — “గాలి వాన వల్ల సెట్ కూలినది నిజమే కానీ, ఎవరికీ ఎలాంటి గాయం జరగలేదు” అని స్పష్టం చేశారు.

ఈ చిత్రానికి హీరోగా మరియు దర్శకుడిగా రిషబ్ శెట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక యుద్ధ కళలు నేర్చుకుంటూ, భారీ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా వరుస దుర్ఘటనలు టీమ్‌ను మానసికంగా ప్రభావితం చేస్తున్నాయని సమాచారం.

“మా చిన్న కృష్ణుడు రెడీ అయ్యాడు!”
కాకూ ఫ్యాన్సీ డ్రెస్సెస్ – కాటన్ ఫ్యాబ్రిక్‌తో ప్రత్యేకమైన యెల్లో కృష్ణకాస్ట్యూమ్!
కృష్ణలీల, జన్మాష్టమి, మైథలాజికల్ ఈవెంట్స్‌కు అద్భుతమైన డ్రెస్సింగ్!
వయస్సు: 2-3 ఏళ్ళ బాలుర కోసం
#1 బెస్ట్ సెల్లర్ | ⭐ 3.6 రేటింగ్ | 50+ కొనుగోళ్ళు గత నెలలో
కేవలం ₹489 – 39% తగ్గింపు!!
️ ఇంకా ఆలస్యం ఎందుకు? చిన్న కృష్ణుడికి ఈ పండుగ ప్రత్యేకంగా చేయండి!

జన్మాష్టమి శుభాకాంక్షలు!

 

అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4oulwwh లింక్‌పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *