భర్తకు సంబంధించిన వ్యక్తి గత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని కర్ణాఖ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధంలో ఉన్నంత మాత్రన భర్త పర్సనల్ వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఇదీ కేసు.. కర్ణాటకలోని హుబ్బల్లికి చెందిన 2005 పెండ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. కొంత కాలం తరువాత పర్సనల్ కారణాలతో భార్య భర్తలు విడిపోయారు. భర్తపై కేసు పెట్టడంతో భార్యకు, కుమార్తెకు భరణం కింద 10 వేలు, 5 వేలు చెల్లించాల్సి అక్కడి ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో భరణం చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని భార్య ఆరోపణలు చేసింది. భర్త ఆచూకి కనుగొనేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ను ఆశ్రయించి ఆధార్ వివరాలు చెప్పాలని సమాచార హక్కు చట్ట కింద కోరింది. ఈ అప్పిల్‌ను 2021 ఫిబ్రవరి 25న ఆధార్ సంస్థ రిజెక్ట్ చేసింది. 2016 ఆధార్ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించలేమని పేర్కొంది. వాటి గోప్యతకు భంగం కలిగించలేమని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధిత మహిళ కర్ణాటక హై కోర్టుకెళ్లింది. స్పందించిన సింగిల్ బెంచ్ ఆ భర్తకు నోటీసులు జారీ చేసింది. ఆ మహిళ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఫిబ్రవరి 8 2023న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పు భారత విశిష్ట ప్రాధికార సంస్థ హైకోర్టు డివిజనల్ బెంచ్‌కు అప్పిల్‌కు వెళ్లింది. ఆధార్ చట్టంలోని (33)1 కట్టుబడి ఉండడటం తప్పనిసరి పేర్కొంది. దీని ప్రకారం.. వ్యక్తి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఇతరులకు చెప్పలేమని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తే తప్ప సమాచారం ఇవ్వలేమని వివరించింది. మరోవైపు ‘పెళ్లయ్యాక భార్యాభర్తల గుర్తింపు అనేది ఇద్దరికి సంబంధించిన అంశం. దంపతుల్లో ఒకరి గురించిన వివరాలను మరొకరు తెలుసుకోవడంలో అభ్యంతరం లేదు. వీరు కాకుండా బయటి (థర్డ్ పార్టీ) వ్యక్తి సమాచారం కోరినప్పుడు పరిమితులు విధించడం సమంజసమే. ఈ కేసులో ఆ షరత్తు వర్తించదు’ అని భార్య తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించారు.