ఈ ఏడాది ‘ఆదిపురుష్’ మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో సీత పాత్రలో నటించిన కృతి సనన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి కృతి సనన్ దిగిన ఫోటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదే సమయంలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని కూడా చెప్పింది. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి సనన్. ‘అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. చాలా తెలివైన వ్యక్తి. బన్నీతో కలిసి పనిచేసే క్షణం కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా.
ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా’ అంటూ మరోసారి తన మనసులో కోరికను బయట పెట్టింది కృతి సనన్. బన్నీతో కలిసి నటించాలని ఉందని ఈ హీరోయిన్ చెప్పడం ఇది మొదటిసారి కాదు. తనకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందిస్తూ బన్నీ సోషల్ విూడియాలో పోస్ట్ పెట్టగా దానికి ఆమె స్పందిస్తూ.. ‘విూతో కలిసి నటించాలని ఉంది’ అంటూ రిప్లై ఇచ్చింది. అలా సందర్భం వచ్చిన ప్రతిసారి బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో కృతి సనన్ కామెంట్స్‌కి ఏకీభవిస్తూ ఫ్యాన్స్ సైతం విూకు కచ్చితంగా బన్నీతో నటించే ఛాన్స్ వస్తుందంటూ సోషల్ విూడియా వేదికగా తమ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే కృతి సనన్ ఈమధ్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను నిర్మాతగా తీస్తున్న ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ‘మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నిర్మిస్తున్న ‘దో పత్తి’ అనే సినిమా సవాళ్లతో కూడుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది కృతి సనన్.
నెత్తుటితో తడిచిన దేహం కాంతారా ప్రీక్వెల్ ప్రారంభం
కాంతారాకు మూవీకి ప్రీక్వెల్ సన్నాహాలు మొదలు పెట్టామని ప్రకటన