Kcr Press Meet” ఎండినపంటలను పరిశీలించేందుకు (Kcr Press Meet) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలా బరువైన గుండెతో మాట్లాడుతున్న.. బాధయితాందన్నారు. ఇంత తక్కువ కాలంలో 100 రోజుల్లో ఇంత దుర్బరమైన పరిస్థితి చూస్తామని మేం అనుకోలేదని (Kcr Press Meet) కేసీఆర్ వాపోయారు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతరని కూడా అనుకోలేదని ఆవేదన చెందారు. వంద రోజుల్లో 200 మందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బాధపడ్డారు. కొందరు కరెంట్ షాక్‌లతోని, కొందరు ఆత్మహత్యలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మళ్లా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి పోతారని నేను కలలకూడా అనుకోలేదని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. గత పదేండ్లలో మేం చాలా వరకు పటిష్టంగా పనులు చేశామన్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు సంభవిస్తున్నట్టు అని ప్రశ్నించారు. లక్షల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని అడిగారు. ప్రజల పక్షాన వార్తలు రాయాలని జర్నలిస్టులకు సూచించారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని, ఎన్నికలు అత్తపోతయ్, గెలిచేటోళ్లు గెలుస్తురు, ఓడటోడు ఓడుతరు ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య ఎవరో గెలుస్తురని తెలిపారు. కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. తెలంగాణా అద్భుతంగా మారి, దేశంలోనే శిఖరాగ్రానికి చేరుకుని, పంట ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణ అనతికాలంలోనే ఇలా ఎందుకు అయ్యిందని ప్రశ్నించారు.
ఇవికూడా చదవండి
Insect Viral Video” ఇలా బుద్ది చెబితే.. మన జోలికిఎవరురారు.. తొండను కొరికిన కీటకం.. వీడియో వైరల్
Kcr Annadata Tour” కేసీఆర్ అన్నదాత భరోసా.. షెడ్యూల్ ఇదే..
Tiger Viral Video” ఏనుగును చూసి దాక్కున్న పులి.. వీడియో వైరల్