చేతకాని దద్దమ్మలు, వెదవలు, పనిచేసే శాతగాక ఎన్నికలను ఎదుర్కొనే దమ్ములేక హింసకు, దాడులకు దిగజారుతున్నారని కేసీఆర్ అన్నారు. దుబ్బాక ఎమ్యెల్యే అభ్యర్థిపై జరిగిన హత్యాయత్నంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ భాగంగా బాన్సువాడలో సోమవారం పాల్గొని మాట్లాడారు. కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, దీనికి తెలంగాణ సమాజమే బుద్దిజెప్పాలని సూచించారు. ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్మురేగాలే ఈ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మా సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. దుబ్బాక అభ్యర్థిమీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థిమీద కాదని తన మీద దాడి జరిగినట్టనేని భావిస్తున్నామన్నారు. గెలిపిస్తే పనిచేయాలే. లేకుంటే ఎవరికున్న పని వారు చూసుకోవాలని సూచించారు. ఎద్దో ఎవుసమో ఏది ఉంటే ఆ పని చూసుకోవాలే. కానీ లంగా చేతలేంది. గుండా గిరి ఏందని ప్రశ్నించారు. అక్కడ గన్ మెన్ అప్రమత్తంగా ఉండి ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలు కాపాడరని అన్నారు. గన్‌మెన్‌కూడా దెబ్బలు తాకయన్నారు. ఈ రకమైన పనులను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. పిరికిపందలు శాతకానోల్లే ఈ పనిచేస్తరన్నారు. శాతనైన మొగోడు ఎవ్వడు కూడా ఈపని చేయరని చెప్పారు.
ఇవి కూడా చదవండి
దుబ్బాక బీఆర్ ఎస్ అభ్యర్థిపై కత్తితో దాడి.. కేసు నమోదు సీపీ శ్వేత
రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్ష ఎక్స్ గ్రేషియా