డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని దాసు డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రజా సమస్యలు అనే అంశంపై సదస్సును ఆర్మూర్ పట్టణంలోని అక్టోబర్ 30న మెడికల్ అసోసియేషన్ హాల్లో సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలపై నిర్దిష్ట హామీతో మేని ఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరల నియంత్రణ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ అధికారంలోకి రాగానే అమలు చేయాలన్నారు. బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం లిఖించారన్నారు. కెసిఆర్ ఇంటికో ఉద్యోగం, రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పేరుతో ఉన్న మూడు లక్షల ఉద్యోగ కార్మికుల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ నీళ్ల మూటగా మారిందని వివరించారు. ఈ సదస్సులో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు యండి. ఖాజా మైనోద్దీన్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, పి వై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చిట్టక్క, మణెమ్మ, బుజ్జి మహిళా సంఘం నాయకులు ఎం లక్ష్మి, హైమది ఐఎఫ్టియు నాయకులు గంగాధర్, పాషా బాయ్ ప్రజా సంఘాల నాయకులు పి రాజేశ్వర్, లోకేష్, అలీమ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
గీ శాత కాని పనులేంది కేసీఆర్ వార్నింగ్
భార్యను చంపి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించి.. ప్రియురాలి భర్తను చంపి.. సినిమాను తలపించే స్టోరీ
ఉల్లి లొల్లి.. కిలో ధర @ రూ. 80
రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్ష ఎక్స్ గ్రేషియా