దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై క‌త్తితో దాడి.. కేసు న‌మోదు సీపీ శ్వేత

మెద‌క్ ఎంపీ, దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై క‌త్తితో సోమ‌వారం హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి దౌల్లాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక్క‌సారిగా క‌త్తితో దాడి చేశాడు. అప్ర‌మ‌త్త‌మైన గ‌న్‌మెన్ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిని కాపాడే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో కొత్త‌ప్ర‌భాక‌ర్‌రెడ్డ‌కి తీవ్ర‌గాయాల‌య్యాయి. మొద‌ట గ‌జ్వేల్ దవఖానాకు, ఆత‌ర్వాత హైద‌రాబాద్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుడి గుర్తింపు
మెద‌క్ ఎంపీ, దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కొత్త‌ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై క‌త్తితో దాడిచేసి హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన నిందితుడిపై కేసు న‌మోదు చేసిన‌ట్టు సిద్దిపేట పోలీస్ క‌మిష‌న‌ర్ శ్వేత ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  దాడి చేసింది సిద్దిపేట జిల్లా మిరుడొడ్డి మండ‌లం పెద్ద చెప్యాల‌కు చెందిన  రాజు (38) గా గుర్తించారు.

ఓటు అనేది బ్ర‌హ్మాస్త్రం : కేసీఆర్

రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష ఎక్స్ గ్రేషియా

ట్రాక్ట‌ర్తో స్టంట్స్ చేయ‌బోతే… ప్రాణాలే పోయాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *