Mettapalli” శంకరపట్నం డిసి ప్రతినిధి..
విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు 6 గొర్రెలు మృతి చెందిన ఘటన మెట్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు బాకారపు మొండయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెందిన బాకారపు మొండయ్య అనే గొర్రెల పెంపకం దారుడు గొర్రెలను మేత కోసం గ్రామ శివారు లోకి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో మెట్ పల్లి గ్రామంలోని ఓ విద్యుత్తు పోలుకు బిగించిన సపోర్ట్ వైర్ ద్వారా విద్యుత్ ప్రవహించింది. దీంతో మేత మేస్తున్న 6 గొర్రెలు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై గొర్రెలు మృతి చెందినట్టు వాటి పెంపకం దారుడు బాకారపు మొండయ్య బోరన విలపిస్తూ తెలిపారు. 6 గొర్రెల మృతితో సుమారు 70 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. బాధిత గొర్రెల పెంపకం దారుని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

రాఖీ అంటే బంధం.. కాదు కదా, ప్రేమ, విశ్వాసం,
ఈ రాఖీ పండుగ రోజున,
తమ్ముడికి మాత్రమే కాకుండా మన వదినకు కూడా
ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా?
CraftVatika నుండి వచ్చిన
కుందన్ రాఖీ సెట్స్‌తో పాటు
“King Bhaiya – Queen Bhabhi” మగ్స్ గిఫ్ట్ కాంబో తో
ఈ రాఖీ ని మరింత ప్రత్యేకంగా మార్చండి! ☕
ఒక మంచి బంధానికి గుర్తుగా…
ప్రేమను వ్యక్తీకరించే ఒక చిన్న ప్రయత్నంగా…
ఈ రాఖీ సెట్స్ తో మీ భయ్-వదిన హృదయాలు గెలవండి!
ఈ సంవత్సరం రాఖీకి ఒక కొత్త అర్థం ఇవ్వండి…
ప్రేమ, గౌరవం, నవ్వుల గిఫ్ట్‌తో!
https://amzn.to/4mdsK5X లింక్ పై క్లిక్ చేయండి.. అమెజాన్‌లో బుక్ చేయండి..
