ఎన్నికల ప్రచారంలో బాగా బిజిగా ఉన్న కేటీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. గత ఆగస్టులో కేటీఆర్ కొడుకు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. హిమాన్షను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌లో ఓ ఫొటో చేశారు. హిమాన్షుతో కలిసి జాగింగ్ చేస్తూ ఉన్న ఫొటోను షేర్ చేసి ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా అని రాసుకొచ్చారు. లవ్ సింబల్ ను కూడా జత చేశారు. అమెరికా ఒక్కడే వెళ్లలేదని తనలో కొంత భాగాన్ని తీసుకెళ్లాడని ఎమోషనల్‌గా రాశారు.