కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలకూడా కాలే.. అప్పుడే ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుటుంది. పదేండ్ల పాలనలో అన్నీ అప్పులు, అక్రమాలే అంటూ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నాయకులు గత పాలనపై దుమ్మెత్తిపోశారు. అదే స్థాయిలో బీఆర్ ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ లీడర్లకు కౌంటర్ ఇచ్చారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు విమర్శల దాడికి దిగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్ర విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తించారు. తాజాగా అదే శ్వేత పత్రంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపిస్తే భరించం అంటూ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని అందులో పేర్కొన్నారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంపగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే…
— KTR (@KTRBRS) December 22, 2023
శ్వేత పత్రానికి కౌంటర్ స్వేద పత్రం.. దెబ్బతీస్తే సహించం కేటీఆర్
కదులుతున్న రైలు ఎక్కొద్దు అంటే వినరు.. చూడండి ఏం జరిగిందో..
శభాష్ కానిస్టేబుల్.. తలుపులు పగులగొట్టి కుటుంబాన్నికాపాడిన పోలీస్..