Electric Vehicles” ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ మినహాయింపు

 Electric Vehicles”  మహారాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ గేట్ల వద్ద టోల్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడమే కాకుండా, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈవీ విధానాలను మరింతగా ప్రోత్సహిస్తోంది.

ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. టోల్ ఛార్జీలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు, బైకుల కొనుగోళ్లకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు, రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు స్థాపితమయ్యే అవకాశమున్నట్లు కూడా భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఢిల్లీ వంటి నగరాల్లో వాహన కాలుష్యం పెరిగిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మహారాష్ట్ర ముందస్తుగా చర్యలు తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూల వాతావరణాన్ని కూడా ఏర్పరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *