రూ. 8 లక్షల విలువగల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను ఆర్టీసీ బస్సులో మరిచిపోయింది ఓ మహిళ. బస్సులో కండక్టర్‌గా పనిచేస్తున్న మహిళ కండక్టర్ ఆ బ్యాగ్‌ను గమనించి ప్రయాణికురాలికి అప్పజెప్పి తన నిజాయితీని చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం (20/10) రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్లే బస్సులో భవాని ప్రయాణించింది. ఈ క్రమంలో జగిత్యాల రాగానే భవాని తన బ్యాగ్‌ను ఆర్టీసీ బస్సులో మరిచిపోయి బస్సు దిగి వెళ్లిపోయింది. కాసేపటికి బస్సులో కండక్టర్ వాణి ఆ బ్యాగ్ గమనించి అందులో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి బ్యాగ్ మరిచిపోయిన విషయం చెప్పింది. వెంటనే భవాని డిపోకు చేరుకోవడంతో కండక్టర్ వాణి డిపోమేనేజర్ సమక్షంలో బ్యాగ్‌ను ఆమెకు అప్పజెప్పింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వాణిని అభినందించారు. ఇది తమ నిబద్దత అని డిపో మేనేజర్ చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు. అనంతరం ప్రయాణికురాలు మాట్లాడుతూ బ్యాగ్ దొరకకపోయి ఉంటే కన్నీళ్లతోనే పండుగ గడిచేదని వాపోయారు. బంగారు అభరణాలు అప్పజెప్పిన కండక్టర్, డ్రైవర్ తిరుపతిలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.
Check Also
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే
Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి …
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు
HONOR 5G Phones” మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే హానర్ ఫోన్లను ఒకసారి పరిశీలించండి. అతి తక్కువ …