Molangur”భక్తుల విరాళాల ద్వారా రూ.68,000 ఆదాయం

Molangur” మొలంగూర్ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం

అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం వెల్లడి

కరీంనగర్ | శంకరపట్నం

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో గల కాకతీయ–నైజాం కాలం నాటి ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన 2026 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా విజయవంతమయ్యాయి.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పక్షం రోజుల పాటు నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వివిధ పూజా కార్యక్రమాలు, కళ్యాణం, ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తుల నుండి రూ.68,000/- ఆదాయం లభించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ వీరేశంతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు గో ల్యాల గంగాధర స్వామి మాట్లాడారు. కోరిన కోరికలు తీర్చి, భక్తుల ఇళ్లలో కొంగు బంగారంలా సుభిక్షాన్ని ప్రసాదించే వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా భక్తుల విశేష పాల్గొనడంతో ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు చైర్మన్ వీరేశం మరియు ప్రధాన అర్చకులు గంగాధర స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

—————————————————————————————————————-

గొల్లపల్లె ఉపసర్పంచ్‌కు ఘన సన్మానం

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా సత్కారం

కరీంనగర్ | శంకరపట్నం

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బాగోతం కుమార్ అలియాస్ సచిన్ ను సోమవారం నిర్వహించిన కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఘనంగా సన్మానించారు.

హైదరాబాద్‌లో రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని, ఉపసర్పంచ్ కుమార్‌ను శాలువాలతో సన్మానించి మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కుమార్ మాట్లాడుతూ, కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులను గౌరవించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో

  • రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు కామ్య మల్లేశం,

  • మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ యేగ్గే మల్లేశం,

  • జిల్లా అధ్యక్షుడు కడారి ఐలన్న,

  • బీర్ల బీరయ్య,

  • రాష్ట్ర, జిల్లా స్థాయి కురుమ సంఘం నాయకులు,

  • ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *