Molangur Zphs” టాపర్స్‌కు నగదు బహుమతుల అందజేత
ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రోత్సాహానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ గారు పేర్కొన్నారు.
సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పదవ తరగతిలో టాపర్‌గా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు గ్రామానికి చెందిన కీర్తిశేషులు నరహరి చిన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం, అతని అల్లుళ్లు మాదాడి మనోహర్ రెడ్డి, కొమ్మర చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి ₹5,116 నగదు బహుమతిగా అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
ఈ సంవత్సరానికి సంబంధించిన నగదు బహుమతులు 2025, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా, దాతలకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసి, శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, దేశ్ముఖ్, ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
