Mosquitoes” కొంత దూరానా గాలి సుడులు తిరుగున్నట్టు కన్పించింది. సుడిగాలి అనుకున్నరు.. టోర్నోడో వలే ఆకాశం వైపు బాగా ఎత్తుగా కనవడింది. భారీ సుడిగాలి అనుకుంటున్న సమయంలో అది వారి ఇండ్లవైపు దూసుకొచ్చింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. చాలా మంది తలుపులు మూసుకున్నారు. మరికొంత మంది అక్కడి నుంచి పారిపోయారు. కొందరు వీడియో తీశారు. అది సుడిగాలి కాదు.. టోర్నడో కాదు. దోమల గుంపు భారీసంఖ్యలో గుమిగూడి నివాసాలవైపు దూసుకొచ్చాయి. ఇదంతా మహారాష్ట్ర లోని పూనే నగరంలో లో చోటు చేసుకుంది. పూణేనగరంలోని ముఠా నది సమీపంలో ఆకాశంవైపు అక్కడి ప్రజలకు ఏదో వింత దృశ్యం కనపడింది. అందరూ అటువైపే చూస్తున్నారు. దగ్గరకు వచ్చే సరికి అది దోమల గుంపు అని తెలియడంతో షాక్ గురయ్యారు. వామ్మో ఇదెక్కడి వింతరా అనుకుంటూ అక్కడి నుంచి పరుగులు తీశారు. కొంత మంది వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. నదిలో అపరిశుభ్రత పెరిగిపోవడంతోనే దోమలు ఇలా తయారయ్యాయని స్థానికులు వాపోతున్నారు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నది.
వీడియోను చూడండి
Mosquitoes tornado in #kharadi.
Hope this will be taken care of soon.@aaplasurendra @Kharadicivic @aolkharadi pic.twitter.com/vNcEv3FU0F— Flt Lt Virender Singh Virdi (Retd.) (@vsvirdi) February 9, 2024
ఇవికూడా చదవండి
virla video” కుర్చి మడతబెట్టి… లగ్గంలో పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో..