Ground nu farmers” ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు రావడంలేదని రైతులు ఆవేదన లోనయ్యారు. తమ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన ఉద్రిక్తత పరిస్థితులు వైపు దారితీసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డులో ఆదివారం చోటు చేసుకుంది. అచ్చంపేట మార్కెట్ యార్డును రైతులు ధ్వంసం చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అరుణ కార్యాలయానికి వెళ్లిన రైతులు ఆమెను మార్కెట్లోకి లాక్కొచ్చారు. పల్లి (వేరుశనగ) పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. చైర్‌పర్సన్ అరుణను పంటపై తోయడంతో ఉద్రిక్తతనెలకొంది.
మద్దతు ధర కోసం అచ్చంపేట మార్కెట్ యార్డును ధ్వంసం చేసిన రైతులు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత.. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణను లాక్కెళ్లిన రైతులు.
వ్యాపారులు సిండికేట్ అయి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం. వేరు శనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్… pic.twitter.com/YDBkEe3Y4n
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024
ఇవి కూడా చదవండి
Mosquitoes” సుడిగాలి అనుకున్నరు.. కానీ కాదు.. అదేదో భయానక గుంపు.. వీడియో వైరల్
virla video” కుర్చి మడతబెట్టి… లగ్గంలో పొట్టు పొట్టు కొట్టుకున్నరు.. వైరల్ వీడియో..