బురదలో ఇరుక్కుపోయిన విద్యాశాఖ మంత్రిని సహాయకులు లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. నాగాలాండ్‌లోని టూరిజం, ఉన్నత విద్యాశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. అందులో చెరువు నుంచి బయటకు వచ్చేందేకు ప్రయత్నిస్తారు. కానీ బయటకు రాలేకపోతారు. కొంత మంది సహాయకులు అతడిని చెరువు నుంచి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. నీళ్లలో ఒకరు, పైన మరో ఇద్దరు సహాయకులు అతడిని లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో జోకులు వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. చెరువులో నేనే అతి పెద్ద చేప అంటూ నవ్విస్తున్నాడు.
Aaj JCB ka Test tha !
Note: It’s all about NCAP Rating, Gadi Kharidney Se Pehley NCAP Rating Jarur Dekhe.
Kyunki Yeh Aapke Jaan Ka Mamla Hain !! pic.twitter.com/DydgI92we2
— Temjen Imna Along (@AlongImna) February 10, 2024