ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్‌శర్మను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించి షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి హార్దిక్‌పాండ్యాకు అప్పగించడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోని ముంబై ఇండియన్ ఫాలోవార్స్ అన్‌ఫాలో చేస్తున్నారు. కింది వీడియోలో హర్థిక్ పాండ్యాను టీంలోకి తీసుకుంటున్నట్టు అంబానీ ప్రకటించడంతో రోహిత్ ఆహ్వానిస్తాడు. రూంలో కి వెళ్తున్న హార్థిక్ పాండ్యాను పిలిచి నువ్వు వైస్ కెప్టెన్‌గా ఉండు నేను కెప్టెన్ అంటాడు. దీంతో నయి నయి నేను కెప్టెన్ లేకుంటే వెళ్లిపోతా అంటూ బ్యాగ్ సర్తుకుంటాడు. దీంతో అంబానీ హార్థిక్ బుజ్జగించి లోపలికి పంపిస్తాడు. దీంతో రోహిత్ అయోమయానికి గురవుతున్నట్టు ముఖ కదలికలను పెడుతాడు.
View this post on Instagram
అంతకుముందు ఏం జరిగిదంటే..
రోహిత్ 2013లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఐదుసార్లు ట్రోఫీని గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం హార్దిక్‌పాండ్య గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. టీమ్ ఏర్పడిన మొదటిసారే జీటీ ట్రోఫిని కైవసం చేసుకుంది. ఇందులో పాండ్య కీలకంగా వ్యవహరించాడు. రెండో సారి రన్నరప్‌గా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముంబయి యాజమాన్యం పాండ్యాను ఎలాగైనా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇదే అనుగుణంగా తమకు పాండ్యను ఇవ్వాల్సిందిగా జీటీ ఫ్రాంచైజీని సంప్రదించడంతో వారు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇలాగైతే కుదరదని నేరుగా పాండ్యను కలిసి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద టీమ్‌కు సారథ్యం వహించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు పాండ్య కూడా అదే చేశారు.
Timeline of Hardik Pandya’s return: (Indian Express).
– MI approached Hardik Pandya for trade.
– Hardik put the condition to be made the captain.
– MI accepted Hardik’s condition and informed Rohit.
– Rohit agreed to play under Hardik.— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2023