గత రెండు మూడు రోజుల నుంచి నిఫా వైరస్ జనాన్ని భయపెడుతోంది. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఇద్దరు మరణించగా మరో ఇద్దరు వైరస్ తో బాధపడుతున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం కీలక చర్యలు మొదలుపెట్టింది. మరణించిన ఇద్దరు కోజికోడ్ జిలా్లకు చెందిన వారు కావడంతో పక్కజిల్లాలను అలెర్ట్ చేసింది. కన్నూర్, వయనాడ్, మలప్పురం జిల్లాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కోజీకోడ్ మెడికల్ కాలేజీలో 75 ఐసోలేషన్ గదులను సిద్ధం చేసినట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు కోజికోడ్ జిల్లాలో 7 గ్రామపంచాయతీలను కంటైన్మెంట్ జోన్‌లో ప్రకటించారు. కేరళ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళాకు చేరుకున్నాయి. కేరళలో వ్యాపించే నిఫా వైరస్ బంగ్లాదేశ్ కు చెందిన వేరియంట్ గా గుర్తించారు.
నిఫా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు అంటుకుంటుంది. గబ్బిలాలు తిన్న పండ్లు తినడం వల్ల మానవులకు సోకుతుంది. వైరస్ సోకిన వారిలో తేలిక పాటి నుండి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. నిఫా వైరస్ వల్ల తరచూ జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. మానసిక ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం పడుతుంది.
చదవండి ఇవి కూడా
భర్తను చంపి.. తప్పించుకోబోయి..
కొట్టుకుపోయిని సిటీ.. 5,300 మంది మృతి.. 10 వేల మంది గల్లంతు
విమానంలో పాడుపని… ట్విట్టర్‌లో వీడియో వైరల్
మా వార్తలు మీకు నచ్చినట్టయితే పక్కనున్న గంట గుర్తు నొక్కండి.. నోటిఫికేషన్ అలో అనండి