రాష్ట్రంకాని రాష్ట్రానికి బతకొచ్చారు. తన స్నేహితులే అని నమ్మి తన పక్క రూములో ఉండమన్నాడు. వారి ఆకలి తీర్చేందుకు తన ప్రియురాలతో వంట చేయించి తన మిత్రుల కడుపు నింపాడు. కడుపు నిండిన ఆ కామాంధులువంట చేసి పెట్టిన బాలికపై కన్నేశారు. సమయం చూసుకుని అన్నం పెట్టిన మిత్రుడని చూడకుండా రూం నుంచి బయటకు గెంటేసి ఆ బాలికపై లైంగిక దాడి చేశారు. మానవత్వం మరిచి రాక్షసంగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన ధర్మేందర్ అదే రాష్ట్రానికి చెందిన ఓ బాలిక (17) ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ధర్మేందర్ ఉపాధి కోసం రంగారెడ్డిజిల్లా ఇబ్రహిం పట్నంపెద్ద చెరువు సమీపంలో ఉంటున్నాడు. బీహార్ కు చెందిన మరో ఇద్దరు అతడి స్నేహితులతో కలిసి మేస్త్రీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. వారం రోజుల కిందట తన ప్రియురాలును కూడా అతడి దగ్గరకు రమ్మన్నాడు. ఒక గదిలో ధర్మేందర్ అతడి ప్రియురాలు, పక్క గదిలో అతడి స్నేహితులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆ బాలికనే వంట చేసేది. ఈ క్రమంలో ఈ నెల
5వ తారీఖున రాత్రి ధర్మేందర్, పక్కగదిలో ఉన్న ఇద్దరు స్నేహితులతో పాటు ఇంకో దగ్గర ఉండే బీహార్ కు చెందిన మరో ఇద్దరు మిత్రులు కలిసి పార్టీ చేసుకుంటున్న క్రమంలో అర్థరాత్రి దాటాకా ధర్మేందర్ ను రూం నుంచి బయటకు నెట్టారు. ధర్మేందర్ ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారం చేశారు. ధర్మేందర్ డయల్ 100 ఫోన్ చేసి పోలీసులకు విషయం చెప్పాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చందన్ కుమార్ , మళ్లు, చందన్, శంభు లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
5 వేల రాకెట్లతో రక్తపాతం సోషల్ మీడియాలో వీడియోలు విడుదల
పేకాట పత్తాలతో 40 అడుగుల నిర్మాణం భారత విద్యార్థి రికార్డు