పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే . ద్రవ్యోల్భణం చుక్కల్లో ఉండడంతో ఇంధన ఆయిల్, ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఆదేశంలోని పేదల పరిస్థితి మరింత దిగజారింది. యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో పేదలు, యాచికులు యాత్రికుల పేరుతో పశ్చిమాసికు పయనమవుతున్నారు. అరబ్ దేశాలకు వెళ్లిన తరువాత అక్కడ బిచ్చగాళ్లగా మారుతున్నారని , ఇరాక్, సౌదీ అరేబియా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌కు వివరించారు. ఈ పరిస్ధితులపై ఓవర్సీస్ పాకిస్తానీస్ స్టాండింగ్ కమిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా వెస్ట్ ఆసియా దేశాల్లో కస్టడీలోకి తీసుకున్న బిచ్చగాళ్లలో 90 శాతం పాక్ పౌరులే. ఇలా అదుపులోకి తీసుకున్న వారంతా ఇర్, సౌదీ అరేబియా దేశాల్లోని జై|ళ్లలో బంధీలుగా ఉన్నారని ఓవర్సీస్ పాకిస్తానీల సెక్రటరీ జీషన్ ఖాన్‌జదా తెలిపారు.
Check Also
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్‌ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..
Tamil Nadu Crime News” తనని ప్రేమించలేదని కోపంతో టీచర్‌ను తరగతి గదిలోనే పొడిచి చంపాడో ఉన్మాది. వివరాలు పరిశీలిస్తే …