దేశ రాజధాని ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. అయితే సంబంధిత ఆహ్వానాలపై ఏండ్లుగా కొనసాగుతున్న ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’, ‘పీఎం ఆఫ్ ఇండియా’ బదులు ‘భారత్ రాష్టపతి’, ‘భారత్ ప్రధాని’ అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా దేశం పేరు మార్పు కోసం రాజ్యాంగాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో భారత దేశం పేరు మార్పుపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. కాగా, దాయాది దేశమైన పాకిస్థాన్ విూడియా కూడా ఈ అంశంపై స్పందించింది. ‘ఇండియా’ అధికారికంగా ఐక్యరాజ్య సమితి స్థాయిలో తన పేరును ‘భారత్’గా మార్చుకున్నట్లయితే, ‘ఇండియా’ పేరును పాకిస్థాన్ దక్కించుకునే అవకాశమున్నదని ఆ దేశానికి చెందిన స్థానిక విూడియా పేర్కొంది. పాకిస్థాన్‌లోని ఇండస్ ప్రాంతాన్ని సూచించే ‘ఇండియా’ పేరుపై హక్కు తమకే ఎక్కువగా ఉన్నదని పాకిస్థాన్ జాతీయులు ఎప్పటి నుంచో వాదిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. పాకిస్థాన్ స్థానిక విూడియా ఎక్స్‌లో ఈ మేరకు చేసిన ఒక పోస్ట్ సోషల్ విూడియాలో వైరల్ అయ్యింది.
Check Also
Viral Video” ఒకరిని చూసి మరొకరు.. కిందవడి నవ్వులపాలు వీడియో వైరల్
Viral Video” తోటి వ్యక్తి తొడ కోసుకుంటే మనం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత.. అచ్చం అలాగే …