చంద్రయాన్ 3 విజయవంతం అయిన తరువాత ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దాదాపు అన్ని దేశాలు భారత్ ను అభినందిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా భారత్ కు అభినందనలు తెలిపింది. అదే క్రమంలో కొంత మంది నెటిజన్లు పాక్ గురించి పోస్టులు పెడుతున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో మీ స్థానం ఎక్కడ అంటూ వేలెత్తి చూపెడుతన్నారు. మరి పాకిస్తాన్ ఏజెన్సీ గురించి తెలుసుకుందామా..!
అమెరికన్ ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపై అడుగిన తరువాత అంతరిక్ష పరిశోధనల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.. అప్పటికే కొన్ని దేశాలు స్పేస్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని ఏర్పాటు చేసుకోవాలని తలపించాయి. ఆక్రమంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను 1969లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాని అంతకంటే 8 సంవత్సరాల ముందే 1961లోనే పాకిస్థాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ SUPARCO (స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమిషన్) ను ఏర్పాటు చేసుకున్నారు.
భారత్, పాకిస్తాన్‌లకు ఒకరోజు తేడాతో స్వాతంత్య్రం వచ్చాయి. తొలి రోజుల్లో పాకిస్తాన్ అన్ని విషయాల్లోనూ పోటీ పడేది. కొన్నింట్లో ముందే ఉండేది. పాకిస్తాన్ స్పేస్ ఏజేన్సీ కూడా భారత్ కంటే ఏనిమిదేళ్ల ముందే ఏర్పాటు చేశారు. ఈ ఏజేన్సీని డాక్టర్ అబ్దుస్ సలామ్ అనే భౌతిక శాస్త్రవేత్త స్థాపించారు. పాకిస్థాన్ అణ్వాస్త్రాలను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1960 నుంచి 1974 వరకు పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఆయన పని చేశారు.
రోవర్ ఇలా దిగింది.. వడివడిగా ప్రజ్ఞాన్ అడుగులు
సుపార్కో ఏర్పాటు చేసిన మొదటి రోజుల్లో సలామ్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు చురుగ్గా పని చేశారు. ఇందు కోసం పాకిస్థాన్ లోని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చేందుకు నాసాతో ఓ ఒప్పందం చేసుకున్నారు. పాకిస్థాన్‌లో మతం ప్రభావం ఎక్కువ ఉంటుంది. జుల్ఫికర్ అలీ భుట్టో ఆధీనంలోని పాకిస్థాన్ ప్రభుత్వం 1974లో అహ్మదీయులు ముస్లింలు కాదని ఓ చట్టం చేసింది. దీంతో సలామ్ అహ్మదీయ వర్గానికి చెందిన వారు కావడంతో పాకిస్తాన్ వదిలి వెళ్లారు. డాక్టర్ సలామ్ పాకిస్తాన్‌ను నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లారు. ఈ ఘటనతో పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధన ప్రయోగాలు కుంటుపడ్డాయి.. డాక్టర్ సలామ్ పాకిస్తాన్ వీడాక ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీసింది. 2023 ఏడాదికి భారత అంతరిక్ష పరిశోధనల కోసం 12,543 కోట్లు కేటాయించగా పాకిస్థాన్ రూ.739.51 కోట్ల ( ఆదేశ కరెన్సీ) తో సరిపెట్టుకున్నది. పాకిస్థాన్‌కు కూడా ‘చంద్రయాన్’ చేపట్టాలనే ఆలోచనలో ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్, చైనా స్థాయికి 2040 నాటికి చేరుకోవాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.