రోవ‌ర్ ఇలా దిగింది.. వడివడిగా ప్రజ్ఞాన్ అడుగులు

చంద్రుడి ద‌క్షిణ దృవంపై ల్యాండ్ అయిన విక్ర‌మ్ త‌న ప‌ని మొద‌లు పెట్టింది. విక్ర‌మ్ నుంచి ప్ర‌జ్ఞాన్ ( రోవ‌ర్ ) బ‌య‌ట‌కు వ‌చ్చింది. విక్ర‌మ్ ల్యాండ‌ర్ దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండింగ్‌ అయినప్ప‌టి నుంచి ఏదో ఒక ఆసక్తికర ఇస్రో సమాచారాన్ని అంద‌రితో పంచుకుంటోంది. అలాంటి వీడియోనే శుక్ర‌వారం ఇస్రో ఆసక్తికర వీడియోను షేర్‌ చేసింది. ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి రోవర్‌ ప్రజ్ఞాన్ బ‌య‌ట‌కు వ‌చ్చి వడివడిగా చంద్రుడి ఉపరితలం పై అడుగుపెడుతున్నచిత్రాల‌ను షేర్ చేసింది. దీనిక సంబంధించిన ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ‘ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-3 ల్యాండర్‌ నుంచి రోవర్‌ కిందికి ఇలా దిగింది’ అని ఇస్రో క్యాప్షన్ పెట్టింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తాజాగా సోషల్‌ విూడియాలో పోస్టు చేసింది. వీడియోలో ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపి.. సెకనుకు ఒక్కో సెం.విూ వేగంతో వడివడిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *