Patel Cricket League” పటేల్ క్రికెట్ లీగ్ సీజన్-2 విజేతగా నిలిచిన రాయచూర్ జట్టు
ముగిసిన పటేల్ క్రికెట్ లీగ్ సీజన్ 2 పోటీలు
కరీంనగర్ డీసీ తెలుగు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పటేల్ క్రికెట్ లీగ్ సీజన్-2 పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం , పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో క్రీడాభిమానులు విశేషంగా పాల్గొన్నారు. మొత్తంగా 50 టీంలు వరకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి రాయ్‌చూర్ టీం రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ సిటీలోని కాపువాడ పటేల్స్, అరెపల్లి గంగాధర టీంలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.
మొదటి నుంచి ఊర్రూతలూగించిన గంగాధర పటేల్స్ టీం..
టోర్నీలో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి మ్యాచ్ చివరి నిమిషం వరకు గ్రౌండ్‌లో ప్రత్యేక ప్రదర్శన కనబరిచింది. ఆట చూసేందుకు వచ్చిన సగటు ప్రేక్షకులంతా ముగ్ఢులయ్యారు. గంగాధర టీంతో ఏటీమైనా ఓటమిని చవిచూసింది. ఎంతటి బలమైనా టీంనైనా అలవోకగా ఎదుర్కొంటూ టోర్నీలో ముందుకెళ్లింది. ఏకపక్ష ప్రదర్శనతో గంగాధర ఆట చూస్తే ఐపీఎల్ ను చూసినట్టు ఫీలయ్యారు. ప్రతి ఒక్కరూ…
గేమ్ చేంజర్‌గా గంగాధర టీం కెప్టెన్ ఘంటా వివేక్
లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్సమెన్‌గా క్రీజులోకి వచ్చిన ఘంటా వివేక్ మైదానం నలువైపులా దంచికొట్టాడు. మెరుపు షార్ట్‌లతో బాల్‌ను గాల్లోకి పంపిస్తూ బౌండరీలను రాబట్టాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించి చూసేందుకు వచ్చిన వారి మనస్సు దోచుకున్నాడు. ఇతర టీం ఆటగాళ్లు సైతం వివేక్ ఆటను కొనియాడారు. బాల్‌ను కొడితే అది సిక్సా, ఫోరా అన్నట్టుగా సాగింది వివేక్ బ్యాటింగ్. ఆటు బౌలింగ్‌లోనూ సూపర్ ప్రదర్శన చేసి గంగాధర టీంను ఫైనల్‌దాకా తీసుకెళ్లాడు. వివేక్ ఆటకు అతని అన్న విజయ్ తోడై గంగాధర టీంను టోర్నిలో ఎదుర్కొనే మరొక టీమే లేకుండా ఆటను ఏకపక్షంగా సాగించారు.
ఆకట్టుకున్న అరెపల్లి, కాపువాడ, కామారెడ్డి టీంలు..
పటేల్ క్రికెట్ టోర్నమెంట్‌లో అరెపల్లి, కాపువాడ, కామారెడ్డి టీంలు ప్రత్యేక ప్రదర్శనను కనబరిచాయి. అరెపల్లి టీంనుంచి ఇద్దరు బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలు చేశారు. బ్యాటింగ్ చేయడంలో కామారెడ్డి, బౌలింగ్‌లో కాపువాడ మెరుగైన ప్రదర్శన కనబరిచాయి..
ఫైనల్ మ్యాచ్లో రాయచూర్ జట్టు గంగాధర జట్టును ఎదుర్కొని ఓటమి ఖాయమనుకున్న దశలో విజయం సాధించింది. చివరి బాల్‌కు ఆరు పరుగుచేయాల్సి ఉన్న సమయంలో బ్యాట్స్‌మెన్ సిక్స్ బాదడంతో రాయ్‌చూరు టీం గెలిచారు.
అనంతరం హుమతి ప్రదాన కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులుగా హాజరై నమున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్ పటేల్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ పటేల్, డిసిపి శ్రీనివాస్ పటేల్ , గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (యూఎస్ఏ )కరీంనగర్ ప్రతినిధి జక్కుల చంద్ర ప్రకాష్ పటేల్, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం యువత ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్ పటేల్, తదితరులు విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఇలాంటి క్రీడాపోటీల నిర్వహణ యువతలో ఐకమత్యం, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తుంది న్నారు .క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక వికాసానికి కూడా దోహదపడతాయిఅని తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ మున్నూరు కాపు వసతి గృహ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్గొండ రవీందర్ పటేల్, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ పటేల్, తూల బాలయ్య పటేల్, ప్రముఖ యాంకర్ , యూట్యూబర్ అంజి మామ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. యువత క్రీడలలో చురుకుగా పాల్గొనాలని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేయడంలో తమ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, కరీంనగర్ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, సూదుల వెంకటరమణ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామినేని మధుసూదన్ పటేల్, కోశాధికారి తోట రమణా పటేల్, ఉపాధ్యక్షులు కొత్త సత్యనారాయణ పటేల్, రఘు పటేల్, సహాయ కార్యదర్శిలు, రాచమల్ల సుగుణాకర్ పటేల్, పోకల మధు పటేల్, హరికృష్ణ పటేల్, చల్ల కృష్ణ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వంగల రమేష్ పటేల్ చందు పటేల్ , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జాడి వెంకట్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటేల్ యూత్ ఫోర్స్ పూరెల్ల అఖిల్ పటేల్,సాయి చరణ్ పటేల్ తోట,పూరెల్ల నిఖిల్ పటేల్ గాజుల శ్రీనివాస్ పటేల్, దాసరి నరేష్ పటేల్, తో పాటు తెలంగాణతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.
గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో పటేల్ క్రికెట్ లీగ్ పోటీల కు బహుమతుల ప్రదానం
గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ యూఎస్ఏ అధ్యక్షులు పెద్ది వెంకట్ పటేల్ ,కోఆర్డినేటర్ తోట సత్యం పటేల్ , కరీంనగర్ ప్రతినిధి చంద్రప్రకాష్ పటేల్ ఆధ్వర్యంలో పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు విజయవంతంగా నిర్వహించబడాయి. క్రీడాకారుల ప్రోత్సాహానికి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అధ్యక్షులు పెద్ది వెంకట్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయని, క్రీడల ద్వారా స్నేహభావం , కలిసికట్టుగా ముందుకు సాగే ధోరణి ఏర్పడుతుందని చెప్పారు. గ్లోబల్ మునుర్కాపు అసోసియేషన్ యూఎస్ఏ కోఆర్డినేటర్ తోట సత్యం, కరీంనగర్ ప్రతినిధి చంద్రప్రకాష్ పటేల్ యువతకు క్రీడల ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, ఇలాంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలని కోరారు.అనేక మంది క్రీడాకారులు, ప్రేక్షకులు ఈ వేడుకలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈ బహుమతుల కార్యక్రమం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మిల్లెట్స్ భోజనం అందించిన కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్
మూడు రోజులు సాగిన పటేల్ క్రికెట్ లీగ్ సీజన్ 2కు కరీంనగర్ డీసీపీ మిల్లెట్స్ తో భోజనం అందించారు. ఇది టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరి రోజు మిల్లెట్ బిర్యాని మరింత ఆకట్టుకుంది. క్రీడాకారులు, ప్రేక్షకులు మంచి పౌష్టికాహారం అందించిన డీసీపి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. మిల్లెట్స్ వల్ల ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందని, యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ ప్రయత్నానికి యువకులు ప్రోత్సాహం ఇవ్వడం చాలా సంతోషకరమని, ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం వారికి ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న యువకులు మిల్లెట్స్ ఆహారాన్ని మెచ్చుకుంటూ, డీసీపీ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం క్రికెట్ పోటీలను మాత్రమే కాకుండా, ఆరోగ్యంపై దృష్టి సారించే ఒక మంచి కార్యక్రమం గా నిలిచింది.