Peddapalli crime” ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కొంత మంది పైశాచికులు మాత్రం మారడం లేదు. ఏ చోట ఉన్నా మహిళలకు భద్రత లేకుండా పోతోంది. చిన్న పిల్లల నుంచి పండుముసలి వాళ్ల వరకు ఎక్కడో ఓ చోట నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్న ఆరేండ్ల బాలికపై ఓ దుర్మర్గుడు రాక్షసంగా ప్రవర్తించాడు. ఆరేండ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన (Peddapalli )పెద్దపల్లి జిల్లా (sultanabad) సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. (asifabad)ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ అతని కుటుంబంతో వచ్చి కాట్నపల్లిలో ఓ రైస్‌మిల్లులో పనిచేస్తు అక్కడే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో (up) ఉత్తరప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఆపాపను ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.