Warangal” బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. షోకేజ్ కోసం ఏర్పాటు చేసిన లైట్లకు తగిలి వ్యక్తి మృతి చెందాడు. అతని చేతిలో చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకాని పేట గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చీకటి యాకయ్య బతుకమ్మ వేడుకలకు తన మనువడితో వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్లాకా బతుకమ్మ ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన కరెంట్ తీగలకు తగిలాడు. అప్పటికే వర్షం పడడంతో నీరు నిలిచి ఉంది. దీంతో యాకయ్య కరెంట్ షాక్ గురయి కిందపడ్డాడు. స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతనిచేతిలో ఉన్న మనవడు క్షేమంగా బయటపడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న కారు డ్యాష్ కెమెరాలో రికార్డయింది.
Tragic Accident in #Warangal District
A devastating incident occurred in Alankanipeta village, Nekkonda mandal, Warangal district, during #Bathukamma celebrations. Ghamaya Yakayya (45) lost his life after being #electrocuted by decorative lights.@VoiceUpMedia1 pic.twitter.com/kx9VdOwxNS— Voiceup Media (@VoiceUpMedia1) October 11, 2024
ఇవి కూడా చదవండి
Study Table స్టడీ ఫోల్డబుల్ టేబుల్ జస్ట్ రూ.499కే
Vardannapet” ట్రాక్టరును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మూడు ముక్కలైన ట్రాక్టర్ .. వీడియో
bathukamma” రంగురంగుల బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ పాటను రచించిన రాజేశ్