Vijayawada”నీ వెంటే నేను.. ప్ర‌మాదంలో భ‌ర్త మృతి.. త‌ట్టుకోలేక భార్య ఆత్మ‌హ‌త్య

Vijayawada

Vijayawada” వారిద్ద‌రికీ 18 నెల‌ల క్రిత‌మే వివాహ‌మైంది. నూరేండ్లు క‌లిసి క‌డ‌దాకా జీవిద్దామ‌ని దాంప‌త్య జీవనం మొద‌లు పెట్టారు. సంతోషంగా గ‌డుపుతున్న వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్ర‌మాదానికి గురై భ‌ర్త మృతి చెందాడు. విష‌యం తెలిసిన భార్య ఆయ‌న మర‌ణాన్ని త‌ట్టుకోలేక వెంట‌నే ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెల్తే.. విజ‌య‌వాడ న‌గ‌రంలోని భాను న‌గ‌ర్ బీఆర్టీఎస్ కాల‌నీకి చెందిన నాగ‌రాజుకు ఉష‌తో 18 నెల‌ల క్రితం వివాహం అయ్యింది. ఈ క్ర‌మంలో నాగ‌రాజు మంగ‌ళవారం ( అక్టోబ‌ర్ 08)న ఉద‌యం ఉద్యోగ రీత్యా బైక్ పై ఇంటి నుంచి వెళ్తున్నాడు. కొద్దిగా దూరం వెళ్లాకా ఎదురుగా మ‌రో ద్విచ‌క్ర‌వాహ‌నం వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో నాగ‌రాజు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు నాగ‌రాజు మృత దేహాన్ని ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. భార్య ఉష‌కు నాగ‌రాజు మృతి విష‌యం తెలిసిన వెంట‌నే ద‌వాఖానాకు రోదిస్తూ వెళ్లింది. మృత‌దేహాన్నిచూసి ఇంటికి వ‌చ్చి భ‌ర్త లేని జీవితం త‌న‌కు వ‌ద్ద‌ని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. గ‌మ‌నించి కుటుంబ స‌భ్యులు ఉష‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన డాక్ట‌ర్లు అప్ప‌టికే ఉష మృతి చెందింద‌ని చెప్పారు. ఒకే రోజు భార్యాభ‌ర్త‌లు మృతి చెంద‌డంతో కాల‌నీలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

మ‌రెన్నో క‌థ‌నాల‌కోసం మా వాట్స‌ప్ చానెల్‌ను ఫాలో అవండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Chain Snatchers” సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు… సీసీవీడియో

Pig Viral Video” ప‌గ‌వ‌ట్టిన పంది.. మ‌నిషిని వేటాడి.. వీడియో వైర‌ల్‌

Curtains” అంద‌మైన డోర్ క‌ర్టెన్‌లు.. అతి త‌క్కువ ధ‌ర‌లో..

Kukatpally” కాలి మ‌ట్టెలు, ప‌ట్టీల కోసం మ‌హిళను చంపిన మ‌రో మ‌హిళ..

Noise Buds” నోయిస్ కొత్తగా లాంచ్ చేయబడిన బడ్స్ కేవ‌లం రూ.1799కే

Up Accident” రోడ్డుపై కూర్చున్న ముగ్గురు యువ‌కులు… వారిపై నుంచి వెళ్లిన కారు.. సీసీ వీడియో

Iron Box” ఫిలీప్స్‌ స్టీమ్ ఐర‌న్ బాక్స్‌ కేవ‌లం రూ. 1,199కే.. 33 శాతం త‌గ్గింపుతో..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *