స్మగ్లింగ్‌ను, అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ఏకంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తు ఇద్దరు పోలీసులు పట్టబడట్టు తెలుస్తోంది. సైబరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టు అందుకున్న బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానాస్పదంగా ఉన్న ఓ మారుతి ఎకో వాహనాన్ని తనిఖీ చేయగా 22 కేజీల గంజాయి, 11 ప్యాకెట్లలో లభించినట్టు సమాచారం. దీని విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. పట్టుబడ్డ ఇద్దరిని విచారించగా తాము ఆంధ్రప్రదేశ్‌లోని 3 వ బెటాలియన్ కు చెందిన పోలీసులమని చెప్పినట్టు సమాచారం. ఒకరు హెడ్ కానిస్టేబుల్, ఇంకొకరు కానిస్టేబుల్ అని తెలిసింది. అధిక డబ్బులకు ఆశపడి… అనారోగ్యం కారణాలతో విధులకు సెలవు పెట్టి మొదటిసారి గంజాయి స్మగ్లింగ్ చేస్తు పట్టబడ్డట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Minister Sitharaman” ఆర్థిక శాఖమంత్రి సీతారామన్ మరో రికార్డు..
elephant attacked” భూమ్మీద నూకలుండటం అంటే ఇదే.. వెంట్రుక మందంలో ప్రాణాలతో..
Ts Rtc ” వారిపై కఠిన చర్యలు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ హెచ్చరిక