కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌గా మార్చారు. అయితే భవనంలో సీఎం రేవంత్‌రెడ్డి నివాసముంటారని అందరూ భావించారు. కానీ డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా ఎన్నికైన భట్టి విక్రమార్క అందులో నివాసముంటారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 14 న ఉదయం ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి బాధ్యతలు స్వీకరించనున్నారు. మరో సీఎం క్యాంపు ఆఫీస్ కోసం కూడా భవనాన్ని వెతుకుతున్నారు.
ఇవి కూడా చదవండి
పార్లమెంటులో ఇద్దరు ఆగంతకుల కలకలం
లేజర్ వెలుగును మింగాలని మొసలి ప్రయత్నం.. ఆటాడుకున్న యువకుడు