మద్యానికి బానిసై కొడుకు వేధిస్తుండడంతో భరించలేని కొడుకు తండ్రిని గొడ్డలితో నరికిన ఘటన మగులు జిల్లా వాజేడు మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని చిన్న గొల్లగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన బంధం రాములు (50) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య, నాగచంద్ర, కొడుకు నరేశ్‌ను తిడుతూ వేధిస్తూండేవాడు.
బుధవారం రాత్రి కూడా మద్యం తాగ వచ్చి తిట్టడంతో నరేశ్ కోపంతో గొడ్డలి తీసుకుని తండ్రిని నరికాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చార్జింగ్ పెట్టుకుంటానంటూ బాలికపై అత్యాచారం
నిజామాబాద్‌లో అచ్చం జులయి సినిమానే.. ఏటీఎం పగలగొట్టి రూ. 10 లక్షలు చోరీ