ఎన్ని కఠిన చట్టాల తెచ్చినా కొంత మంది మృగాళ్లలో మార్పు రావడం లేదు. రోజుకో చోట మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉజ్జయినిలో జరిగిన ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో రాజ్‌పురా ఏరియాలోని ఓ గ్రామానికి ఓ వ్యక్తి తనకు పరిచయమున్న 15 ఏండ్ల బాలిక ఇంటికి వెళ్లాడు. ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. చార్జింగ్ పెట్టుకుంటానంటూ ఆ బాలికతో చెప్పాడు. ఇంట్లోకి ప్రవేశించిన అతను ఆ బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పొలం పనులు చేసుకుంటారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.