Thursday , 5 December 2024

కులరహిత సమాజం కోసం పోరాడుదాం

డీసీ తెలుగు నిజామాబాద్
మహాత్మా జ్యోతి బాపూలే స్పూర్తితో కులారాహిత సమాజం కోసం పోరాడుదామ‌ని CPI ML న్యూడెమోక్రసి భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి.బాలయ్య కారల్ మార్క్స్ లు అన్నారు. సత్యశోదక్ సమాజ్ 150 వ వార్షికోత్సవం సందర్భంగా రేకులపల్లి లో న్యూడేమోక్రాసి ఆధ్వర్యంలో గురువారం కుల నిర్ములన సదస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సదస్సులో వారు మాట్లాడుతు ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఇక్కడ ఉందని చెప్పారు. కుల వ్య‌వ‌స్త‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌ల‌న్నారు.

మనువాద ధర్మానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలేనే అన్నారు. 150 సంవత్సరాల క్రితమే దేశంలో ప్రజల మధ్య జరుగుతున్న అసమానతలు,అణచివేతలు,దాడులు, దౌర్జన్యలు నిరసిస్తూ దళితులను, అణగారిన ప్రజలను అత్యంత హీనంగా చూసే కుల వ్యవస్థకు వ్యతిరేకంగ పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతి బాపూలే అన్నారు. ఆరోజుల్లోనే తన సహచరిని సావిత్రి బాయ్ పూలె ద్వారా అణగారిన ప్రజలకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు చదువు చెప్పిన మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రి బాయ్ పూలెనే అని కొనియాడారు.
అనంత‌రం కారల్ మార్క్స్ మాట్లాడుతూ..
దేశంలో ప్రజలు ఏం తినాలో ఏం తినద్దో అనేది శాశిస్తున్నారు నేటికీ ఈ పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఇంతటి కులాహంకారం తలకెక్కిన‌ అగ్రవర్ణ ఆధిపత్య ధోర‌ణినికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో మల్కి సంజీవ్ గులాబ్ హుస్సేన్ సాకలి చిన్న గంగాధర్ కుమ్మరి ప్రవీణ్ మాల రాములు బాకారం గంగారెడ్డి శివరాజ్, నర్సాగౌడ్, రేకులపల్లి గ్రామ కమిటీ సభ్యులు దాసు లక్ష్మణ్ గోపి దేవదాస్ జగన్ స్వామి జి గంగారాం, తదితరులు పాల్గొన్నారు

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

చార్జింగ్ పెట్టుకుంటానంటూ బాలిక‌పై అత్యాచారం

నిజామాబాద్‌లో అచ్చం జుల‌యి సినిమానే.. ఏటీఎం ప‌గ‌ల‌గొట్టి రూ. 10 ల‌క్ష‌లు చోరీ

About Dc Telugu

Check Also

05.12.2024 D.C Telugu Cinema

05.12.2024 D.C Telugu Morning

04.12.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com