Rajiv Yuva Vikasam” రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు- ఇవ్వనుంది ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటు-న 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీనికి కావాల్సిన పత్రాలు.. దరఖాస్తు కు కావాల్సినవి
1. ఆధార్
2. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి (అన్ని కులాల వారికి )
ఆదాయం సర్టిఫికెట్ లేటెస్ట్ ఉండాలి. (ఏప్రిల్ 2024 నుండి)
3. పాన్ కార్డు
4. దరఖాస్తు దారుడి ఫోటో
5. లబ్ధిదారుడి ఫోన్ నంబర్
6. ఫుడ్ సెక్యూరిటీ కార్డు,
7. చదువు అర్హత సర్టిఫికేట్..
8. బ్యాంకు అకౌంట్
9.
ఉపాధి అంశాలు :
@.వ్యవసాయ అంశాలు
1.ఎద్దుల బండ్లు
2.ఆయిల్ ఇంజిన్
3.పంప్ సెట్
4.ఎయిర్ కంప్రెషర్
5.పత్తి సేకరణ యంత్రం
6.వేరుషనగ మిషన్
7.వర్మీ కంపోస్ట్
8. ఆయిల్ ఫామ్ పంట
@.పశుపోషణ
1. గేదెలు
2. ఆవులు
3. డైరీ ఫారం
4. కోడిగుడ్ల వ్యాపారం
5. చేపల వ్యాపారం
6. మేకల పెంపకం
7. పాల వ్యాపారం
8. పౌల్ట్రీ ఫారం
9. గొర్రెల పెంపకం
@. సొంత వ్యాపారం
1. ఎయిర్ కూలర్ల వ్యాపారం
2. స్టీల్ సామాన్ల వ్యాపారం
3. ఆటోమొబైల్ షాపు
4. బేకరీ షాపు
5. గాజుల దుకాణం
6. హెయిర్ కటింగ్ షాపు
7. బుట్టల తయారీ షాపు
8. బ్యూటీ పార్లర్ షాపు
9. జనరల్ స్టోర్
10. ఇటుకలు తయారీ వ్యాపారం
11. డిష్ టీవీ ల ఏర్పాటు
12. వడ్రంగి షాపు
13. సీసీ కెమెరాల రిపేర్ షాప్
14. ఎలక్ట్రిక్ షాపు
15. ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ కేంద్రం వైరింగ్ కేంద్రం
16. మగ్గం టైలరింగ్
17. చెప్పులు అమ్మే దుకాణం
18. పండ్ల వ్యాపార కేంద్రం
19. పండ్ల రసాల దుకాణం
20. బట్టల దుకాణం
21. కిరాణం జనరల్ స్టోర్
22. జనరేటర్ షాప్
23. గిఫ్ట్ ఆర్టికల్ షాప్
24. బంగారు నగల దుకాణం
25. పిండి గిర్ని కేంద్రం
26. హోటల్ ఏర్పాటు
27. ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు
28. ఐరన్ బిజినెస్
29. లేడీస్ కార్నర్
30. లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్
31. పేపర్ ప్లేట్ల తయారీ
32. లైట్స్ డెకరేషన్ సౌండ్ సిస్టం
33. అగరబత్తుల తయారీ
34. మినీ సూపర్ బజార్
35. మెడికల్ అండ్ జనరల్ స్టోర్
36. ఆటో టిఫిన్ సెంటర్
37. మోటార్ మెకానిక్
38. మోటార్ అండ్ పైప్ లైన్
39. మటన్ షాపు
40. పాన్ షాపు
41. పేపర్ బ్యాగుల తయారీ
42. ఫోటో అండ్ వీడియో షాపు
43. పిండి గిర్ని
44. ఫిల్టర్ వాటర్ కేంద్రం
45. రెడీమేడ్ బట్టల దుకాణం
46. చీరల వ్యాపారం
47. స్లాబ్ కటింగ్ మిషన్
48. స్ప్రే పెయింటింగ్ మిషన్
49. స్టీల్ అండ్ సిమెంట్
50. స్టిచింగ్ మిషన్
51. సప్లయర్స్ షాపు
52. మిఠాయిల షాపు
53. టైలరింగ్
54. వెల్డింగ్ షాపు
55. వాటర్ సర్వీసింగ్ సెంటర్
56. కూరగాయల వ్యాపార షాపు
57. టిఫిన్ అండ్ టీ షాప్
58. టీవీ మెకానిక్ షాప్
59. సెల్ ఫోన్ రిపేర్ షాప్
60. సిమెంటు ఐరన్ షాపు
61. సెంట్రింగ్ పరికరాల షాపు
62. చెప్పుల తయారీ షాపు
63. చికెన్ సెంటర్
64. బట్టల వ్యాపారం
65. కాఫీ హోటల్
66. కాంక్రీట్ మిల్లర్స్ పరికరాలు
67. కూల్ డ్రింక్ షాప్
68. క్రేన్
69. కర్రీస్ పాయింట్
70. సైకిల్ మెకానిక్
71. వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు
72. డీజిల్ ఆటో
73. డిజిటల్ కెమెరా షాపు
74. సెటప్ బాక్స్ ల ఏర్పాటు
75. కూరగాయల దుకాణం
76. డీటీపీ, జిరాక్స్..
పై వాటికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 05/04/2025.
Peddapalli” ఉచిత ఆర్మీ శిక్షణ కోరకు దరఖాస్తుల ఆహ్వానం
Naga Chaitanya” కార్ రేసింగ్ ట్రాక్ వద్ద శోభిత, నాగచైతన్య క్యూట్ ఫొటోలు.. మీరు చూసేయండి
Karimnagar news” ఎమ్మెల్యే కవ్వంపల్లి పై రసమయి తప్పుడు ఆరోపణలు..
Viral accident” నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తి కనురెప్ప మూసేలోపే.. ఢీ కొట్టిన కారు..
Cinema News” నిన్నటి నుంచి ట్రెండింగ్.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే