Sardar-2″ జులై 25న ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ రిలీజ్‌ – ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది

Sardar-2″  ముంబై:
2012లో విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన హాస్య చిత్రం **‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’**కి సీక్వెల్‌గా రూపొందిన ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’ జులై 25న థియేటర్లలో విడుదల కానుంది. అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించారు.

ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌లో పంజాబీ అమ్మాయిగా మృణాల్ ఠాకూర్ అజయ్ దేవగణ్‌తో కలిసి హాస్యాన్ని పంచుతూ కనిపించింది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండడం మరో హైలైట్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *