బీఆర్ఎస్ ను బీజేపీకి ‘బీ’ టీమ్‌ అని అందుకే అంటారు కేటీఆర్‌.. కర్ణాటక సీఎం రీ ట్వీట్‌

బీజేపీ వాళ్లు ఎడిట్‌ చేసిన నకిలీ వీడియోలను సర్క్యులేట్‌ చేస్తున్నందుకే బీఆర్‌ఎస్‌ను పర్ఫెక్ట్‌ ‘బీ’ టీమ్‌ అంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన ఎక్స్‌ ద్వారా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌కు మంగళవారం కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తామని, అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా.. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు” అంటూ కర్నాటక సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో చెబుతున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయింది. కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ద్వారా ఆ వీడియోను పోస్టు చేశారు. దీనిపై కేటీఆర్‌ ఇలా రాసుకొచ్చారు. కనీసం హామీలపై ఆర్థిక పరిశీలన లేకుండా ఎలా ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో సైతం ఇలాగే రిపీట్‌ అవుతుందని పోస్టు చేశారు. ఇలా ప్రజలను మభ్యపెట్టే హామీలను ఎలా ఇస్తారని, తెలంగాణలో కూడా ఇంతేనా అని ధ్వజమెత్తారు.
బీజేపీకి పర్ఫెక్ట్‌ ‘బీ’ టీమ్‌ బీఆర్‌ఎస్‌: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో వ్యాఖ్యలపై వీడియోకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేటీఆర్‌కు కౌంటర్‌గా ట్వీట్‌ చేశారు. మిస్టర్‌ కేటీఆర్‌.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎందుకు ఓడిపోయిందో తెలుసా.. మీకు ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలుసుకోవడం తెలియకనే. ప్రజలకు తెలుసు ఎవరిని ఎత్తుకోవాలో.. ఎవరిని దింపాలో అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏదో విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతుందన్నారు. బీజేపీ నాయకులు తన వ్యాఖ్యలను ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాలు వ్యాప్తి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్‌ పోస్టు చేసి బీజేపీకి బీ టీమ్‌ అని ఒప్పుకున్నాడని తెలిపారు. ఏది నిజమో.. ఏది అబద్దమో అవగాహన లేకుండా సోషల్‌ మీడియాలో వచ్చిన వాటిని సాకుగా చూపి విమర్శిస్తున్నారని అన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *