Thursday , 12 September 2024
Breaking News

సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ

 ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు
అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు
హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు
వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ

కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ విూడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎస్పీ పేర్కొన్న వివరాల మేరకు.. ఆర్థిక లావాదేవీలతోనే వరుస హత్యలను నిందితుడు చేసినట్లుగా పేర్కొన్నారు. గతంలో తీసుకున్న అప్పును చెల్లించలేక ప్రసాద్‌ ను నమ్మబలికి తన ఆస్తులను సైతం కాజేసేందుకు హంతకుడు ప్రశాంత్‌ కుట్రలకు దిగినట్లుగా తెలిపారు. ప్రసాద్‌ ఆస్తులను తన పేరిట బదలాయించుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని హతం చేస్తే అడిగే వారుండరని భావించి తన తల్లి ఒడ్డెమ్మ సహాయంతో ఇదంతా చేసినట్లుగా ఎస్పీ సింధూ శర్మ చెప్పారు. ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటుగా ఒక మైనర్‌ బాలుడు, మరో ఇద్దరు నిందితులు బానోతు విష్ణు, బానోతు వంశీలను అరెస్టు చేశారు.వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ తో సహా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ నిందితులను మంగళవారం విూడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్‌ పి చెప్పిన వివరాల ప్రకారం.. మాక్లూరు మండలంలోని మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్‌,విష్ణు,వంశీ అనే ముగ్గురు నవంబర్‌ 29న ప్రసాద్‌ను బండరాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత ప్రశాంత్‌.. ప్రసాద్‌ ఇంటికి వచ్చి అతని భార్య శాన్వికను కలిశాడు.

బీఆర్ఎస్ ను బీజేపీకి ‘బీ’ టీమ్‌ అని అందుకే అంటారు కేటీఆర్‌.. కర్ణాటక సీఎం రీ ట్వీట్‌

ప్రసాద్‌ జైలులో ఉన్నాడని, అతన్ని కలుద్దామని తీసుకువెళ్లి, బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుల సాయంతో ఆమెను చంపి, గోదావరిలో పడేశారు. అదే రోజు ప్రసాద్‌ చెల్లెలు శ్రావణికి కూడా మాయమాటలు చెప్పి, వడియారం వద్ద ఆమెను హతమార్చి, మృతదేహాన్ని తగులబెట్టారు. అంతటితో దుండగులు ఆగలేదు. ప్రసాద్‌ తల్లిని, పిల్లలను, మరో చెల్లిని కూడా మాయమాటలు చెప్పి నిజామాబాద్‌ తీసుకువెళ్లారు. డిసెంబర్‌ 4న పిల్లల్ని చంపి, మృతదేహాలను డోన్‌ వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్‌ 13న ప్రసాద్‌ చెల్లెలు స్వప్నను సదాశివనగర్‌ మండలం భూంపల్లి వద్ద హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి కాల్చేశారు. ప్రశాంత్‌ పై అనుమానం వచ్చి ప్రసాద్‌ తల్లి సుశీల లాడ్జినుంచి తప్పించుకుని పారిపోయింది. కామారెడ్డి జిల్లా పాల్వంచలో ప్రశాంత్‌ ను, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని, ప్రసాద్‌ కుటుంబ సభ్యుల ఫోన్లను ప్రశాంత్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సింధు శర్మ చెప్పారు. ప్రసాద్‌, అతని భార్య మినహా మిగిలిన మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు.

గాలికి క‌దిలిన విమానం… వీడియో వైర‌ల్

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం భూంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44కు ఐదు కిలో విూటర్ల దూరంలో డిసెంబర్‌ 14న హత్యకు గురైన దివ్యాంగురాలైన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లైంగికదాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల సీసీ టీవీలను పరిశీలించగా ఒక అనుమానాస్పద కారును గుర్తించినట్టు తెలిసింది. ఈ కారు నంబర్‌తోపాటు సెల్‌ఫోన్‌ సిగ్న‌ల్‌ డాటాను విశ్లేషించగా మాక్లూర్‌ మండలంలోని ప్రశాంత్‌ అనే యువకుడికి సంబంధించిన ఆనవాళ్లు బహిర్గతం అయ్యాయి. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు హత్యా వివరాలు ఇలా ఉన్నాయి. డబ్బులిస్తానని నమ్మబలికి తొలుత రాచర్లకూన ప్రసాద్‌ను ప్రశాంత్‌ తన వెంట తీసుకెళ్లాడు. డిచ్‌పల్లి హైవే పక్కన హత్య చేశాడు. అక్కడే పూడ్చిపెట్టాడు. ప్రసాద్‌, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారని నమ్మబలికి ప్రసాద్‌ ఇద్దరి చెల్లెళ్లు స్వప్న (దివ్యాంగురాలు), స్రవంతిని వేర్వేరుగా హంతకులు చంపేశారు. ఇందులో ఒకరి మృతదేహం భూంపల్లి శివారులో దొరకడంతోనే ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. వరుసగా మొదటి మూడు హత్యలను ప్రశాంత్‌ ఒక్కడే చేసినట్టుగా తెలుస్తున్నది. మిగిలిన హత్యలను ప్రశాంత్‌ సన్నిహితులైన మైనర్లు చేసినట్టు సమాచారం. నిందితులను కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఆరుగురి హత్య ఉదంతంలో డిసెంబర్‌ 8న ప్రసాద్‌ కూతురు చైత్రిక, డిసెంబర్‌ 5న చేగుంటలో చెల్లెలు స్రవంతి, డిసెంబర్‌ 14న భూంపల్లిలో మరో చెల్లె స్వప్న (దివ్యాంగురాలు), డిసెంబర్‌ 18న కుమారుడు చైత్రిక్‌ మృతదేహాలను నిజామాబాద్‌ నిర్మల్‌ సరిహద్దు వద్ద గల సోన్‌ బ్రిడ్జి దగ్గర పోలీసులు గుర్తించారు. ప్రసాద్‌, రమణి మృతదేహాలను వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. సీరియల్‌ కిల్లర్‌ ప్రశాంత్‌ వయసు 25 ఏండ్లే. పేద కుటుంబమే అయినా జల్సాలు చేసేవాడు. అయితే ప్రశాంత్‌ చేతిలో హత్యకు గురైన ప్రసాద్‌ సైతం గతంలో ఒక యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు కాగా పలువురిని మోసం చేసిన కేసుల్లోనూ ముద్దాయి కావడం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి

కాసేపేట్లో ఐపీఎల్‌ వేలం… రోహిత్ వైపే అంద‌రి చూపు

అప్పులు ఉన్నాయంటూ ఆలస్యం… తెలంగాణాలోనూ భ‌విష్య‌త్ ఇదేనా…? కేటీఆర్ ట్వీట్ ..

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” అదిరంద‌య్యా.. లేటెస్ట్ గుర్ర‌పు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైర‌ల్‌

Viral Video”   ద్విచ‌క్ర‌వాహ‌నాలు, ఆటోలు, జీపులు రాక‌ముందు మ‌నుషులు ర‌వాణా కోసం గుర్ర‌పు బండ్ల‌ను ఉప‌యోగించారు. సాంకేతిక‌త పెరిగినంకా గుర్ర‌పు …

Xiaomi Power Bank

Xiaomi Power Bank” మీరు మంచి ప‌వ‌ర్ బ్యాంక్ కోసం చూస్తున్నారా..? 45 శాతం త‌గ్గింపుతో.. జియోమీ ప‌వ‌ర్ బ్యాంక్

Xiaomi Power Bank” ఫోన్ అవ‌స‌రాలు ఎక్కువ‌గా ఉన్నవారు మంచి ప‌వ‌ర్ బ్యాంక్‌ల కోసం చూస్తుంటారు. జియోమి నుంచి మంచి …

Xiaomi Tv

Xiaomi Tv” 42999 రూపాయ‌ల విల‌గ‌ల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివ‌రి రోజు

Xiaomi Tv” ప్ర‌స్తుతం అమెజాన్‌లో ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్ న‌డుస్తోంది. ఎన్నో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై భారీ త‌గ్గింపు ప్ర‌క‌టించింది. మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com