Wednesday , 30 April 2025

Shankarapatnam news” శంక‌ర‌పట్నం వార్త‌లు

Shankarapatnam news”

మొలంగూర్ దుర్గా వైన్స్ లో చోరీ..

సిసి ఫుటేజ్ వీడిఆర్ నూ ఎత్తుకెళ్లిన దొంగలు..
ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రవి, క్లూస్ టీం బృందం..
శంకరపట్నం డీసీ ప్రతినిధి
మ‌ద్యం దుకాణం పైభాగంలోని రేకును క‌ట్ చేసిన దొంగ‌లు అందులో దూకి చోరీకి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా శంక‌ర‌ప‌ట్నం మండ‌లం మొలంగూర్ క్రాస్ రోడ్ వ‌ద్ద‌నున్న వైన్స్‌లో చోటు చేసుకుంది.
వైన్స్ యజమాని గాజుల శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద గల దుర్గ వైన్స్ బుధవారం రాత్రి విక్రయాలు పూర్తి అయిన తర్వాత సిబ్బంది తాళాలు వేసి వెళ్లార‌ని తెలిపారు. గురువారం ఉదయం షాపు తెరిచే సమయం లో షాపు తెరిచి లోపలికి వెళ్లేస‌రికి దుర్గ వైన్స్ పైకప్పును క‌ట్ చేసి క‌న‌ప‌డింద‌న్నారు.. క‌ట్ చేసిన భాగం నుంచి దొంగలు లోప‌లికి దూకి వెళ్లి క్యాష్ కౌంటర్ ను, పగలగొట్టి, అందులో ఉన్న కొంత డబ్బు, మద్యం సీసాలను ఎత్తుకెళ్లార‌ని శ్రీ‌నివాస్ వాపోయారు. సీసీ కెమెరా రికార్డింగ్ వీడిఆర్ కూడా ఎత్తుకెళ్లినట్లు ఆవేద‌న చెందారు. చోరీ సమాచారాన్ని కేశవపట్నం పోలీసులకు అందించామ‌న్నారు. ఘ‌ట‌న స్థ‌లానికి కేశవపట్నం ఎస్ ఐ కొత్తపల్లి రవి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం ను పిలిపించి, నమూనాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

/////////////////////////////////////////////////////////

బాలల సంరక్షణ మన అందరి బాధ్యత…
ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి…
శంకరపట్నం డీసీ ప్రతినిధి
బాలల సంరక్షణ మన అందరి బాధ్యత అని ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం బాలల సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సిడిపిఓ శ్రీమతి మాట్లాడారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు ప్రభుత్వం అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అనాధ‌ బాల బాలికలను గుర్తించి, వారి బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందజేసేందుకు తమ వంతు కృషి చేయాల‌న్నారు. విద్య అభ్యాసం కోసం ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల‌ని సూచించారు. బాలల సంరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాల కార్మిక నిర్మూలనకు కృషి చేయాల‌న్నారు. తల్లిదండ్రులు కోల్పోయి అనాధ పిల్లలకు అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో డిపిఓ బి జగదీశ్వర్ ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, మండల వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్, ఏఎస్ఐ సుధాకర్, ఏపిఎం సుధాకర్, సిహెచ్ఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////

మిషన్ భగీరథ శ్రేష్టమైన తాగునీరు…
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి ప్రభుత్వ లక్ష్యం…
ప్రణాళిక బద్ధంగా, తాగునీటి సరఫరా పై శ్రద్ధ..
డి పి ఓ జగదీశ్వర్…
శంకరపట్నం డీసీ ప్రతినిధి
మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే తాగునీరు ఎంతో శ్రేష్టమైందని, నీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి బి జగదీశ్వర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి హాజరైన డిపిఓ జగదీశ్వర్ మాట్లాడారు. వేసవికాలంలో తాగునీటి సరఫరా పైన, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌న్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసి నీటి సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా అందించే తాగునీరు ఎంతో శ్రేష్టమైందని ప్రజలకు అవగాహన కల్పించాల‌న్నారు. ఈ స‌మావేశంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ అంజన్ రావు, డి ఈ కాజా వసియోద్దీన్, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

 

About Dc Telugu

Check Also

అంత‌రిక్షంలో ప‌లు ప‌రిశోధ‌న‌ల కోసం వెళ్లిన వ్యోమ‌గాముల‌కు ఆహారం అందించేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. దీనిపై ఫ్రెంచ్ సైంటిస్టులు దృష్టి సారించారు. …

Viral Video” పోలీస్‌స్టేష‌న్‌కు చిరుత‌పులి…. త‌ర్వాత ఏమైందంటే.. వీడియో

Viral Video” అడవిలో ఉండాల్సిన పులి పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా …

China” పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు.. చైనాది పాత పాటే..

China”  ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడుల త‌ర్వాత భారత్ పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాము ఉగ్ర‌దాడి చేయ‌లేదంటూనే యుద్దానికి సిద్ద‌మ‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com