Shankarapatnam News” 01.04.2025 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

Shankarapatnam News” రాజ్యాంగాన్ని రక్షించుకుందాం…
జై బాబు జై భీమ్ జై సంవిధాన్ విజయవంతం చేయాలి…
కోఆర్డినేటర్ శ్రీనివాస్…
శంకరపట్నం డిసి ప్రతినిధి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని కాలరాసే అందుకు కుట్రలు చేస్తున్నారని, రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయ కాంగ్రెస్ చేపట్టిన యాత్ర, ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న,జై బాపు జై భీమ్ జై సoవిధాన్ విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకర పట్నం మండలం, కేశవపట్నం శివారులో గల శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం

కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సoవిధాన్ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కోఆర్డినేటర్ శ్రీనివాస్, శంకరపట్నం మాజీ జెడ్పిటిసి టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస గౌడ్ మాట్లాడారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, కాల రాస్తుందని విమ‌ర్శించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయా అధ్యక్షులు మల్లికార్జున కార్గే, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సం విధాన్, గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు, ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న యాత్రను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ఆదేశం మేరకు నిర్వహించే యాత్రను గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా గడపగడపకుతీసుకెళ్లి రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి టిపిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కొత్తగట్టు మచ్చ గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చింతరెడ్డి పద్మ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అజయ్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు మొహమ్మద్ షారుక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పవన్, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////////////

బాధిత కుటుంబానికి యువరాజ్ చేయూత..
బియ్యం అందజేసిన యువరాజ్…
ప్రభుత్వం ఆదుకోవాలి…
సామాజిక కార్యకర్త, స్వతంత్ర జడ్పిటిసి అభ్యర్థి యువరాజ్…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
సామాజిక కార్యకర్త, సేవా హృదయం కలిగిన స్వతంత్ర జడ్పిటిసి అభ్యర్థి, శనిగరపు యువరాజ్, సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం , శంకరపట్నం మండలంలోని మక్త గ్రామానికి చెందిన షేక్ అజీజ్, షేక్ రెహమాన్ అనే తండ్రి కొడుకులు మృతి చెంద‌డం బాధ‌క‌రమ‌న్నారు. వీరి మ‌ర‌ణం ఆ కుటుంబానికి తీరని లోటు అని వాపోయారు. అజిజ్ కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతివ్యక్తం చేశారు. ఆ భగవంతున్ని అజీజ్ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరార‌. తన వంతు సహాయంగా బియ్యం అందజేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అజీజ్, రెహమాన్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వము, ఆదుకోవాలని యువరాజ్ కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////

ఘనంగా రంజాన్ వేడుకలు..
శంకరపట్నం డిసీ ప్రతినిధి..
రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులు, మత గురువుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకంగా మండపాల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం లోని, కేశవపట్నం, మొలంగూర్, అంబాల్ పూర్ ,ఇప్పలపల్లె, కరీంపేట్, తాడికల్, ఏరడపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లోని ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండుగను జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, హిందువులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

//////////////////////////////////////////////////////////////////////////////

అనాధ పిల్లలతో ఉగాది పండగ జరుపుకున్న… సామాజిక , వ్యాపారవేత్త రవీందర్ రావు దంపతులు..
దుస్తులు, పండ్లు పంపిణీ..
శంకరపట్నం డిసి ప్రతినిధి
సామాజిక , ప్రముఖ వ్యాపారవేత్త వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం లోని, మెట్టుపల్లి గ్రామానికి చెందిన, రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు , అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లల మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి ,తండ్రి కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న చిన్నారులు వారిని మరచిపోయేందుకు మేమున్నామని భరోసా కనిపించేలా ఉగాది పచ్చడి చేసి వారితో పాటుగా స్వీటు తినిపించి పచ్చడి తాగించి వేడుకలు జరుపుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. ఒంటరి పిల్లలకు భరోసా కల్పించేందుకే , తెలుగు నూతన సంవత్సరాది. ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగిందని రవీందర్ రావు లక్ష్మీ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందన అనాధ శరణాలయం నిర్వాహకులు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////////////

దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి బీసీ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి…
బీసీ అజాధి రాష్ట్ర అధికార ప్రతినిధి అభిలాష్ గౌడ్…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
దేశవ్యాప్తంగా కులగణ‌న చేపట్టి బీసీ బిల్లును పార్లమెంటులో  ప్రవేశపెట్టాలని బీసీ ఆజాది రాష్ట్ర అధికార ప్రతినిధి బొంగోని అభిలాష్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఆజాది వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ చేపట్టే దీక్ష పోస్టర్లను సోమవారం. మండ‌ల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిలాష్ గౌడ్ మాట్లాడారు. బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా ఏప్రిల్ మొదటి వారంలో శంకరపట్నం మండ‌ల‌ కేంద్రంలో బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరావధిక రిలే నిరాహార దీక్షలను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసారు. ఈ దేశానికి వెన్నుముకగా ఉండి ఉత్పత్తి, శ్రామికవర్గాలు గా ఈ దేశాన్ని నడిపిస్తున్న బీసీ వర్గాలు నేటికీ వెనుకబడిన వర్గాలుగానే మిగిలి ఉన్నారని ఆవేదన చెందారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో నష్టపోతు న్నారని జనాభాలో52% శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని హక్కులు హరించబడు తున్నాయని విమ‌ర్శించారు. బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ నేత దేశ వ్యాప్త ఉద్యమంతో కులగణన సాధించేందుకు గత 15 రోజులుగా డిల్లీలో అన్ని రాజకీయాల పార్టీల నాయకులను, కార్యాల యాల్లో నాయకులను, పార్లమెంటు సభ్యులను కలుస్తూ, కుల గణన కోసం ఒప్పిస్తున్నారని తెలిపారు ఏప్రిల్ మొదటి వారంలో శంకరపట్నం మండల కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయబోతు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడిక్యాల భాస్కర్,ప్రధాన కార్యదర్శి వ్యసబట్టు మధుసూదన్ రాజు, బీసీ నాయకులు గుర్రం సదానందం,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుక మారి శ్రీనివాస్, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పంజల రేవంత్, రాష్ట్ర నాయకులు జినుకల లక్ష్మణరావు, గాజవెల్లి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////

మత్స్య గిరద్ర స్వామి జయంతి 2 న…
ప్రత్యేక పూజలు….
ఆలయ ప్రధాన అర్చకులు మురళీధరాచార్యులు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
ఆది దేవాయ ప్రతామావతార శ్రీ మత్స్య గిరింద్ర స్వామి జయంతి రెండున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఆలయ ప్రధాన అర్చకులు శేషం మురళీధర ఆచార్యులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మురళీధరచార్యులు మాట్లాడారు. ఆది దేవతాయ ప్రథమావతారమైన శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవాలయం. కరీంనగర్ జిల్లా, మానకొండూ ర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని కొత్త గట్టు గుట్టపై వెలసిన శ్రీ భూనీల సమేత శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయములో ఏప్రిల్ 2 న మత్స్య జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, ఆశేష భక్తజనం మత్స్య జయంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించదలచిన భక్తజనం. ఆలయంలో రసీదు పొంది. అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలని కోరారు. పూజ సామాగ్రి పంచామృతం పండ్ల రసం, పూలు, పండ్లు, కుంకుమ పసుపు, కొబ్బరికాయ అగర్బత్తులు పూజకు భక్తులు తమ ఇంటి నుండి తీసుకువచ్చి, స్వామి వారి జయంతి రోజున ప్రత్యేక పూజలు ఆచరించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అర్చకులు మురళీధరాచార్యులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *