ఎస్ ఐ ఫలితాలు విడుదల
ఖాకీ డ్రెస్ వేసుకోవాలనే పరితపించే నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ ఫలితాల మీద పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా 587 ఎస్ పోస్టులకు గానూ ప్రిలిమ్స్ రాతపరీక్ష, ఈవెంట్స్, మెయిన్ రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరికేషన్ ను నిర్వహించారు. ఇందులో ఆదివారం నాడు ఎంపికయిన వారి జాబితాను విడుదల చేశారు. సివిల్ ఎస్ కి 414 పోస్టులకు పురుషులు 274, మహిళలు 140, ఏఆర్ మొత్తంగా 66, ఉండగా అందులో పురుషులు 59, మహిళలు 7గురు ఎంపికయ్యారు. మిగిలిన వాటిలో వివిధ భాగాలకు ఎంపికైన వారి జాబితా ను వెల్లడించారు.