- అడ్డువస్తున్నారని హత్యలు..
- వివాహేతర సంబందాల వల్ల కూలుతున్న సంసారాలు
- అనాథలవుతున్న పిల్లలు..
- అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ నేరస్తులను పట్టుకుంటున్న పోలీసులు
భార్యభర్తలు .. రత్నలాంటి ఇద్దరు పిల్లలు హాయిగా సాగిపోతున్న కాపురం.. కాని అదంతా ఒకనాటి ముచ్చట.. క్షణిక సుఖాలు వారి జీవితాలను నాశనం చేశాయి. వారి పసి పిల్లల జీవితాలు దుర్భరంగా మారతున్నాయి… దంపతుల్లో ఒకరు వివాహేతర సంబంధం నెరపడం. అడ్డువస్తున్నారని లైఫ్ పార్టనర్ చంపడం నిత్యం వార్తలు చదువుతూనే ఉంటున్నాం. ఎంత పకడ్బందీగా చేసినా, ఎంత తెలివి ఉపయోగించినా పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేస్తూ అన్ని కోణాల్లో విచారిస్తు నేరస్తులను కటకటాల్లోకి నెడుతున్నారు.
ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసి ఏమీ తెలియనట్టు నటించిన భార్యను కటకటాల్లోకి నెట్టారు. భర్తకు ఫుల్లుగా మద్యం తాగించి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆతరువాత ఏమీ తెలియనట్టు పోలీసలకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యకు ఎదురింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడం అది భర్తకు తెలియడంతో తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య, ఆమె ప్రియుడు, మరొకరి సహాయంతో ఈ హత్య చేసినట్టు తెలుగు చూసింది. మరణించిన వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విశాఖ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది.
కొన్ని నెలల కింద హైదరాబాద్‌లోనూ ఇటువంటి ఘటనే జరిగింది. 15 సంవత్సరాల కొడుకు, భార్య ఉన్న ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్యకు పట్టుబడ్డాడు. దీంతో భార్య అతనితో గొడపడింది. అయినా ఆ వ్యక్తి మానలేదు. తరచూ గొడవలు జరుగుతుండడంతో తమ సంబంధానికి అడ్డువస్తుందనే కోపంతో భార్య ను కొట్టి బిల్డింగ్‌పై నుంచి తోసేశాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెంది.
హత్య చేసి.. ఏమార్చబోయి.. అడ్డంగా దొరికి
భర్తను హత్య చేసి అతని స్థానంలో మరొకరిని ప్రవేశపెట్టి పుట్టింటి వారిని.. అత్తింటి వారిని నమ్మించబోయి అడ్డంగా దొరికిందో మహిళ. ఈ ఘటన కొన్నేళ్ల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్లో చోటు చేసుకుంది. భర్తకు రోడ్డు యాక్సిండెంట్ చేసి శవాన్ని కాల్చేసి అతని స్థానంలో ఆమె ప్రియుడు హాస్పటల్లో చేర్చింది. అందరిని అలాగే నమ్మించింది. ముఖానికి ప్లాస్టిక్ సర్జీరీ చేయింది. ఆస్పత్రి నుంచి డిశార్చీ అయిన తరువాత ఇంట్లో ఆ వ్యక్తి మాంసం తింటూ చనిపోయిన వ్యక్తి బంధువుల కంటపడ్డాడు. అదే వారిద్దరిని పోలీసులకు పట్టించింది. వాస్తవానికి చనిపోయిన వ్యక్తి చిన్ననాటి నుంచి మాంసం తినే అలవాటు లేకపోవడం కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా ఇష్టంగా మాంసం తినడం. ప్రవర్తనలోనూ మార్పులు కనపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నేరస్తులను అరెస్టు చేశారు.
ఇవి మచ్చుకు రెండు ఘటనలే..
ఇవి మచ్చుకు రెండు ఘటనలే. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి.. క్షణిక సుఖాల కోసం పరాయి వ్యక్తి మోజులో ఇలా హత్యలు చేస్తున్నారు. క మనిషిని చంపడం ఎంత వరకు సమంజసం.. ఇంకొక వ్యక్తి ప్రాణాలు తీయడమనేది రాక్షస క్రీడ
తప్పించుకుంటామని.. అనాథలవుతున్న పిల్లలు..
హత్య చేసి అది సహజ మరణంగా రీ క్రీయేట్ చేసి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నారు. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు నేరస్తులను జైలుకు పంపుతున్నారు. ఇదంతా ఒకవైపే అయితే తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి.. మరొకరు జైలుకు వెళ్లడంతో ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి… క్షణిసుఖాలు, విలాసవంతమైన జీవితాలంటూ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. .
చట్టం తనపని తాను చేసుకుపోతుంది..
నేరస్తులు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు..