RAKUL” బ్యాచ్‌లర్‌ పార్టీ ఇచ్చుకున్న రకుల్‌

RAKUL

రకుల్‌ ప్రీత్‌ సింగ్ తన అందం, అభినయంతో టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది. టాలీవుడ్‌లో అగ్రహీరోలతో నటించిన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం తన దృష్టిని అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. అయితే ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు జాకీ భగ్నానీతో రకుల్‌ ఈ నెల 21న గోవాలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన స్నేహితులకు బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చింది. థాయ్ లాండ్ వేదికగా ఈ బ్యాచిలర్‌ పార్టీ జరుగగా.. ఈ పార్టీకి టాలీవుడ్‌ హీరోయిన్స్‌ ప్రగ్యా జైస్వాల్‌, సీరత్‌ కపూర్‌, మంచు ల‌క్ష్మీ తదితరులు హాజరయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి 21న గోవాలోని ఓ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రకుల్‌ పెళ్లి గ్రాండ్‌గా జరుగనుంది. ఇదిలావుంటే.. రకుల్‌ ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమాలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తోంది. రకుల్‌ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలంలో నటించింది. ఆ తర్వాత హిందీపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది.

ఇవి కూడా చ‌ద‌వండి

It’s a swimket” భూమ్మీద ఆడితే క్రికెట్‌… ఇది స్విమ్‌కెట్ వీడియో వైర‌ల్

Mlc kavitha” సూర్య‌నిమీద ఉమ్మేస్తే మీ మీదే ప‌డుతుంది.. ఎమ్మెల్సీ క‌విత

కాశ్మీర్ నుంచి చిన్న‌పిల్లల రిపోర్టింగ్.. సంబుర ప‌డ్డ ఆనంద్ మ‌హింద్రా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *